సముచిత నిర్ణయాలు

                  మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పక్షాల మధ్య సాగిన ప్రచారం ప్రజల అసలు సమస్యలను వదిలేసి వక్రమార్గాలు తొక్కింది. దేశం ఎదుర్కొంటున్న కఠోరమైన సవాళ్ల ప్రస్తావన నుంచి దూరం జరిగిపోయి అసందర్భ విన్యాసాలకు పాల్పడింది. అటువంటి ప్రచార క్రీడ ద్వారా మరోసారి అధికారాన్ని సాధించుకున్న ప్రధాని మోడీ ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వచ్చినట్టు కనిపిస్తున్నది. నిజమైన జన బాధలను పట్టించుకోవాలని సంకల్పించినట్టు బోధపడుతున్నది. శుక్రవారం […] The post సముచిత నిర్ణయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

                  మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పక్షాల మధ్య సాగిన ప్రచారం ప్రజల అసలు సమస్యలను వదిలేసి వక్రమార్గాలు తొక్కింది. దేశం ఎదుర్కొంటున్న కఠోరమైన సవాళ్ల ప్రస్తావన నుంచి దూరం జరిగిపోయి అసందర్భ విన్యాసాలకు పాల్పడింది. అటువంటి ప్రచార క్రీడ ద్వారా మరోసారి అధికారాన్ని సాధించుకున్న ప్రధాని మోడీ ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వచ్చినట్టు కనిపిస్తున్నది. నిజమైన జన బాధలను పట్టించుకోవాలని సంకల్పించినట్టు బోధపడుతున్నది. శుక్రవారం నాడు జరిగిన ఆయన కొత్త మంత్రివర్గం మొట్టమొదటి భేటీలోనే రైతులు, చిన్న వ్యాపారులపై దృష్టి సారించడం ఇందుకు తార్కాణం. ప్రజలకిచ్చిన వాగ్దానాలను తన గత హయాంలో పూర్తిగా మరిచిపోయి వ్యవహరించిన మోడీ సర్కారు ఈసారి అటువంటి పొరపాటు చేయరాదని అనుకున్నదో ఏమో అధికార దండం చేతికి రాగానే దేశంలో అత్యంత సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న చిన్న, మధ్య తరహా రైతులు, కింది స్థాయి వ్యాపారుల మంచి కోసం నిర్ణయాలు తీసుకున్నది.

ఇది ఎంతైనా హర్షించవలసిన పరిణామం. మొన్నటి ఎన్నికలకు ముందు ఆదరాబాదరాగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని దేశంలోని దాదాపు 15 కోట్ల మంది చిన్న మధ్యతరహా రైతులందరికీ వర్తింపచేయాలని అలాగే చిల్లర వర్తకులకు పెన్షన్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఒక్కొక్క రైతుకు ఏటా రూ. 6000 వంతున నగదు సాయం అందించాలని ఇంతకు ముందు నిర్ణయించారు. ఎన్నికలకు ముందు 12 కోట్ల 50 లక్షల మందికి దీనిని అందించారు. ఇప్పుడు మిగతా 2 కోట్ల రైతు కుటుంబాలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించారు. ఆ విధంగా మొత్తం 14 కోట్ల 50 లక్షల మంది రైతులకు విడతల వారీగా ఏటా రూ. 6000 అందేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులకే వర్తింప చేయాలని పరిమితి విధించారు. ఇప్పుడు దానిని రద్దు చేశారు. ఎటువంటి పరిమితీ లేకుండా చిన్న మధ్య తరహా రైతులందరికీ వర్తింప చేయాలని నిర్ణయించారు.

దేశంలో రైతులు కనీవినీ ఎరుగని కష్టనష్టాల్లో దుర్భరమైన బతుకులు వెళ్లదీస్తున్నారన్న కఠోర వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గ్రహించిందని ఈ నిర్ణయం చాటుతున్నది. అయితే వ్యవసాయ సంక్షోభం కేవలం రైతులకు మాత్రమే పరిమితమైనది కాదు, ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న సెంటు కుంటు భూమిలేని వ్యవసాయ కార్మికులు, సంబంధిత వృత్తి కులాలవారూ చెప్పనలవికాని కష్టాలు ఎదుర్కొంటున్నారు. పొట్ట చేతపట్టుకొని వలసలు పోతున్నారు. వారి గురించి కూడా ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. వాస్తవానికి రైతులకు నేరుగా నగదు సాయం అందించాలని మొట్టమొదటగా సంకల్పించి అమల్లోకి తెచ్చినవారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావే. తెలంగాణలో ఒక్కొక్క ఎకరాకు ఐదు వేలు చొప్పున వానాకాలం, ఎండా కాలం పంటలు రెండింటికీ మొత్తం భూమికి లెక్క గట్టి ఇస్తున్నారు. దానిని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల తరణోపాయంగా ప్రధాని కిసాన్ పథకాన్ని రూపొందించింది. దీని కింద ఎన్నికలకు సరిగ్గా ముందు విడతలవారీ రెండేసి వేల రూపాయలను రైతుల ఖాతాలలో వేశారు.

ఇప్పుడీ పథకాన్ని విస్తరించినందువల్ల కేంద్ర ప్రభుత్వం మీద అదనంగా ఏటా 12 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. మొత్తంగా పథకం కింద 87 వేల కోట్ల రూపాయలవుతుంది. అయితే రైతులకు ఈ ఒక్క పథకంతో ఒరిగేది అంతగా ఉండదు. వారికి ఇలా నగదు విదిలించినందువల్ల అందులోనూ ఏడాదికి కేవలం రూ. 6000 ఇచ్చినందువల్ల చెప్పుకోదగ్గ ప్రయోజనం కలగదు. ఇందుకు బదులుగా రైతులు పండిస్తున్న పంటకు స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా ఇంటిల్లిపాదీ పడే శ్రమ వ్యయాన్ని, భూమి అద్దెను కలిపి సహేతుకమైన మద్దతు ధర అందేలా చేస్తే ఈ ఉచిత వితరణలతో వారికి పని ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఈ వైపుగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 ఈ నిర్ణయాల అమలులో అత్యంత అర్హులకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యతను విస్మరించరాదు. ఈ చర్యల వల్ల మాత్రమే చిన్న 60 ఏళ్లు దాటిన రైతులకు, చిన్న వ్యాపారులకు పింఛను ఇవ్వాలన్న ఆలోచన కూడా హర్షించదగినదే.వ్యవసాయదారులు, వ్యాపారులు, ఇతరులు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోతాయని భావించడానికి వీలులేదు. మొత్తంగా దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా చూడాలి. నిరుద్యోగాన్ని, దళారీల దోపిడీని అంతమొందించవలసిన అవసరం ఉన్నది.

Modi came back to power through the Kisan scheme

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సముచిత నిర్ణయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: