వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటి పనిచేయదు: ట్రాయ్

  నవంబర్ 4 నుంచి నవంబర్ 10 వరకు వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటిని నిలిపివేస్తున్నట్లు టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్ 11 నుంచి కొత్త విధానంలో మొబైల్ నంబర్ పోర్టబులిటి ప్రారంభం కానుంది. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ట్రాయ్ వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవలను నిలిపివేసింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. మొబైల్ నంబర్ పోర్టబులిటి మరింత సులభతరం కానుంది. […] The post వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటి పనిచేయదు: ట్రాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నవంబర్ 4 నుంచి నవంబర్ 10 వరకు వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటిని నిలిపివేస్తున్నట్లు టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్ 11 నుంచి కొత్త విధానంలో మొబైల్ నంబర్ పోర్టబులిటి ప్రారంభం కానుంది. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ట్రాయ్ వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవలను నిలిపివేసింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. మొబైల్ నంబర్ పోర్టబులిటి మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం మొబైల్ నంబర్ పోర్టబులిటికి దాదాపు వారం రోజుల వరకు సమయం పడుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే.. కేవలం రెండు రోజుల్లోనే మీరు ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు మారిపోవచ్చు. ఈ విషయాన్ని ట్రాయ్ స్వయంగా వెల్లడించింది.

ప్రస్తుతం పోర్ట్ పెడితే నెట్ వర్క్ మారడానికి దాదాపు వారం రోజుల వరకు పడుతుంది. నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పదో తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు మొబైల్ నంబర్ పోర్టబులిటి పని చేయదని ట్రాయ్ ఒక ప్రకటన ద్వారా వివరించింది. అప్పట్నుంచీ మొబైల్ నంబర్ పోర్టబులిటికి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్ పోర్టబులిటి ప్రక్రియలో వినియోగదారులు యూపిసిని జనరేట్ చేసి నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు అందిస్తే వారి అభ్యర్థనను ఆమోదిస్తామని కూడా ట్రాయ్ తెలిపింది. అయితే ఆ లోపు కోడ్ ను జనరేట్ చేయలేకపోతే.. నవంబర్ 11 వరకు వేచి ఉండాల్సిందేనని పేర్కొంది. నవంబర్ నాలుగో తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో పోర్ట్ పెట్టడానికి ప్రయత్నించే వారికి తమ తరఫు నుంచి ఎటువంటి స్పందన రాదని ట్రాయ్ చెప్పింది.

Mobile number portability in the new process

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వారం రోజుల పాటు మొబైల్ నంబర్ పోర్టబులిటి పనిచేయదు: ట్రాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: