శ్రీనిజను అభినందిస్తున్న ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్…

  వరంగల్: శ్రీనిజను అభినందిస్తున్న ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్. సామాజిక సేవలతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన బొమ్మిడి శ్వేత, రాజేష్ దంపతుల కుమార్తె శ్రీనిజ పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో బాటసారులకు కొబ్బరిబొండాలను ఉచితంగా ఇస్తూ దాహం తీర్చారు. ఈ సందర్భంగా హాజరైన పశ్చిమ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్, డిప్యూటి మేయర్ సిరాజుద్దీన్‌లు శ్రీనిజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆమె చేస్తున్న సామాజిక సేవను హర్షించారు. అనంతరం […] The post శ్రీనిజను అభినందిస్తున్న ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్: శ్రీనిజను అభినందిస్తున్న ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్. సామాజిక సేవలతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన బొమ్మిడి శ్వేత, రాజేష్ దంపతుల కుమార్తె శ్రీనిజ పుట్టినరోజు సందర్భంగా హన్మకొండలో బాటసారులకు కొబ్బరిబొండాలను ఉచితంగా ఇస్తూ దాహం తీర్చారు. ఈ సందర్భంగా హాజరైన పశ్చిమ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్, డిప్యూటి మేయర్ సిరాజుద్దీన్‌లు శ్రీనిజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆమె చేస్తున్న సామాజిక సేవను హర్షించారు. అనంతరం ఆయనమాట్లాడుతూ… ప్రతి సంవత్సరం శ్రీనిజ పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇదే స్పూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి తల్లిదండ్రులకు, సమాజానికి పేరు తేవాలన్నారు. అనంతరం తాగునీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కొబ్బరిబోండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బాటసారులు శ్రీనిజను అభినందించారు.

 

MLA Vinaybaskar who appreciates Srinija

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శ్రీనిజను అభినందిస్తున్న ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: