కుర్చీకోసం కుస్తీ

MBNR-image

మహబూబ్ నగర్‌కు జైపాల్ రెడ్డి ?                                                                                                                          బరిలో కొత్వాల్, సయ్యద్ ఇబ్రహీం, ఎస్.సురేందర్‌రెడ్డి                                                                                                టిడిపి నుంచి ఎర్రశేఖర్                                                                                                                                        మఖ్తల్, దేవరకద్రకు పెరిగిన పోటీ                                                                                                                            మహా కూటమికి ఒక్క సీటైనా ఇస్తారా ?                                                                                                          మహబూబ్‌నగర్ అడుగుతున్న టిజెఎస్

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్: మహా కూటమి ఏర్పడక ముందే టికెట్ల కుమ్ములాటలు మొ దలయ్యాయి. ఇంకా టికెట్ల వ్యవహారంపై ఒకకొలిక్కి రాకుండానే టికెట్టు తనకే వస్తుందని ఎవరికి వారు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. మహా కూటమిలో టికెట్ల లొల్లి ప్రారంభం కాగా, మరో వైపు గులాబి దళాల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టిఆర్‌ఎస్ ప్రచార వేడికి మహా కూటమి ఆమడదూరంలో ఉంటోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ ని యోజకవర్గంపై మహా కూటమిలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సుమారు రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎక్కువగా ముస్లింలు, ముదిరాజ్ రెడ్డి, యాదవ్, బోయ, ఎస్‌సి, ఎస్‌టిల సామాజి క వర్గాలు ఎక్కువగా ఉన్నారు. అధికంగా ముస్లింలు, ముదిరా జ్‌ల ఓట్లు లక్షకుపైగా ఉంటాయి. దీంతో మహా కూటమిలో పార్టీలు కుల ప్రాతిపదికన టికెట్‌లు కేటాయించాలా లేదా అ న్నదానిపై కూడా తర్జన భర్జనలు పడుతున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి క న్నేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కేంద్ర పార్టీ అధిష్టానం నుం చి కూడా అనుమతి పొందినట్లు సమాచారం.అయితే ఇంత వరకు కాంగ్రెస్‌లోనే మహబూబ్‌నగర్‌పై ఆశలు పెట్టుకున్న వా రి పరిస్థితి డోలాయమా నంలోపడ్డట్లు అయ్యింది. జైపాల్ రెడ్డి ఎంపిగా పోటీ చేస్తే తమ కు అవకాశాలు వస్తాయని అనేక మం ది ఆశించుకున్నారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి  ఒబేదు ల్లా కొత్వాల్,  సయ్యద్ ఇబ్రహిం, సురేందర్‌రెడ్డిలు ఆశలు పె ట్టుకోగా, ఇటు మహా కూ టమి నుంచి మాజీ ఎమ్మెల్యే ము దిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎర్రశేఖర్ ఆశలు పెట్టుకు న్నారు. ఇదిలా ఉండగా మ రో వైపు తెజాసా నుంచి రాజేందర్ రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి యన్నం శ్రీనివాస్ రెడ్డిలు ఆ శలు పెట్టుకున్నారు. కాని వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగి లిన వారు అసమ్మతిగా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తు న్నారు. ఈ అసమ్మతి టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు లేక పోలేదు. ఈ నేప థ్యంలో మహబూబ్ నగర్ విషయంలో మహా కూటమి నాయకులు కుల, మత సామాజిక ప్రా తిపదికన టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

ఎర్ర శేఖర్ తనకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో జడ్చర్ల వదిలి మ హబూబ్ నగర్‌పై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇప్పుడు మహా కూటమిలో కూడా కాంగ్రెస్ కు టికెట్ కేటాయిస్తే, అందులోనూ జైపాల్ రెడ్డి లాంటి వా రికి టికెట్ వచ్చినా, సయ్యద్ ఇబ్రహీం, కొత్వాల్‌లో ఎవరికి టికెట్ వచ్చినా ఎర్రశేఖర్ పరిస్థితి ఏమిటన్నది మహాకూ టమిలో తొలగని ప్రశ్న. కూటమి నుంచి జడ్చర్లకు ఇస్తారా అంటే అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవిని కాదని ఎర్రశేఖర్‌కు ఇస్తారా అన్నది సవాలక్ష అనుమానాలు. అదే విధంగా నారాయణపేటకు ఎర్రశేఖర్‌కు అవకాశం ఇ ద్దామనుకున్నా అక్కడ ఇటివలనే కాంగ్రెస్‌లోకి చేరిన శివ కుమార్ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.ఈ నేపథ్యంలో మహా కూటమి నేతలు ఎవరికి వారు టికెట్ల వ్యవహారంలో గట్టిగా నే ఉన్నారు. ఇక దేవరకద్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, జి మధుసూధన్‌రెడ్డిలు పోటీ ప డుతున్నారు.

ఇక మహా కూటమి నుంచి టిడిపి సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు సీతా దయాకర్ రెడ్డి, దయా కర్‌రెడ్డిలు పోటీలో ఉన్నారు. ఒక వేళ కూటమి ద్వారా టి డిపికి కేటాయిస్తే డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, జిఎంఆర్‌లు పరిస్థితి ఏం చేయాలన్నది అంతుబట్టడం లేదు. వనపర్తి విష యంలోనూ చిక్కుముడి ఉంది. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, మహా కూటమి నుంచి రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు పోటీలో ఉ న్నారు. ఇప్పటికే పెబ్బేరులో చిన్నారెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీంతో మహా కూటమిలో వనపర్తి టికెట్‌పై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఇక మఖ్తల్ విషయం లోనూ ఇదే సందిగ్దత నెలకొంది. మహా కూటమిలో ఉన్న వామ పక్షాలు కూడా ఎవరి పక్షాన చేరుతారన్నది ప్రశ్నగా మారింది. కొల్లాపూర్, మహబూబ్‌నగర్, ఆత్మకూర్, నారాయణపేట ప్రాంతాల్లో విపక్షాలకు కొంత మేరకు పట్టు ఉంది. కాని వారి ఎవరికి మద్దతు ఇస్తారన్నది అనుమానం గా మారింది.ఇలా మహా కూటమిలో ఎవరికి వారు టికెట్ల పై ఆశలు పెట్టుకున్నప్పటికీ చివరికి ఎవరికి వరిస్తాయన్నది సందిగ్దంగా మారింది.

హేమా హేమీలు ఈ జిల్లా నుంచే: కాంగ్రెస్‌లో హే మా హేమీల నేతలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో చోటుద క్కడంతో ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ముఖ్య నాయ కులంతా ఈ జిల్లా వారు కావడం తో జిల్లా ఎన్నికలను సీరి యస్‌గానే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి కీలక బాధ్యతలు అ ప్పగించారు. అలాగే డికె అరుణ, జైపాల్‌రెడ్డి, నాగం జనా ర్దన్‌రెడ్డి, వంశీ కృష్ణ, సంప త్‌కుమార్, కొత్వాలలు ఈ జిల్లా వారే కావడంతో ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. టిఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఢీ కొట్టాలన్న లక్షంతో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు టిఆర్‌ఎస్ నేతలు ప్రచారంతో ఊపుమీదున్నారు. కాంగ్రెస్‌కు అంతనంత దూరంలో గులాబి దళాలు దూ సుకుపోతున్నాయి. మహా కూటమిలో చిక్కుముడులు వీడా లంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Comments

comments