గన్‌మెన్‌లను రిటర్న్ చేసిన ఎంఎల్‌ఎ రేగా

MLA Rega kantha rao

 

మన తెలంగాణ/మణుగూరు: నేను నిరంతరం ప్రజల్లోనే ఉంటానని, నియోజకవర్గ ప్రజలే నాకు రక్షణ అని, నేను ప్రజల మనిషిని కాబట్టి నాకు ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటి అవసరం లేదని పినపాక ఎమ్మేల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం స్ధానిక ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేను సామాన్య రైతు కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చానని, నాకు హంగు ఆర్బాటాల కంటే ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడమే ముఖ్యమని, 2018లో ఎమ్మేల్యేగా గేలుపోందగానే సెక్యూరిటిని తిరస్కరిద్దాం అనుకున్నా కానీ నాటి పరిస్ధితులు, ప్రజల్లో నేలకోన్న ఆగ్రహావేశాల నడుమ ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటి అవసరమని అనుకున్నానని, అగస్టు15న దేశానికి స్వేచ్చ లబించినదని కావునా అదే రోజు నాకు ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత 6 గురు సెక్యూరిటి సిబ్బందిని ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారని, వారిని ప్రజల రక్షణకోరకు ఉపయోగించుకోవాలని కోరుతున్నానని తెలిపారు.

MLA Rega kantha rao returned his gunmen to government

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గన్‌మెన్‌లను రిటర్న్ చేసిన ఎంఎల్‌ఎ రేగా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.