గులాబీ జెండా ఎగరాలి : ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్

హసన్‌పర్తి(వరంగల్ అర్బన్ ): గల్లీ నుంచి ఢిల్లీ వరకు కెసిఆర్ నాయకత్వం కొనసాగేలా స్థానిక పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ అన్నారు. గురువారం కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి మండలంలోని జయగిరి, అనంతసాగర్, మడిపల్లి, సీతంపేట, గంటూరుపల్లి, పెంబర్తి, నాగారం, బైరాన్‌పల్లి, సిద్ధాపూర్, అర్వపల్లి, మల్లారెడ్డి పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  జడ్పిటిసి అభ్యర్థిని రేణుకుంట్ల సునీత, వివిధ గ్రామాల ఎంపిటిసి అభ్యర్థుల గెలుపునకు నిర్వహించిన  ప్రచార కార్యక్రమంలో […] The post గులాబీ జెండా ఎగరాలి : ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హసన్‌పర్తి(వరంగల్ అర్బన్ ): గల్లీ నుంచి ఢిల్లీ వరకు కెసిఆర్ నాయకత్వం కొనసాగేలా స్థానిక పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ అన్నారు. గురువారం కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి మండలంలోని జయగిరి, అనంతసాగర్, మడిపల్లి, సీతంపేట, గంటూరుపల్లి, పెంబర్తి, నాగారం, బైరాన్‌పల్లి, సిద్ధాపూర్, అర్వపల్లి, మల్లారెడ్డి పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  జడ్పిటిసి అభ్యర్థిని రేణుకుంట్ల సునీత, వివిధ గ్రామాల ఎంపిటిసి అభ్యర్థుల గెలుపునకు నిర్వహించిన  ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏమి అభివృద్ధి జరగదని, బిజెపి పార్టీకి ఓటు వేస్తే అది శూన్యమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సిఎం కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి  ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు కారు గుర్తుపై ఓట్లు వేయాలని  ఆయన కోరారు. కెసిఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి, కార్యక్రమాలు కొనసాగించేందుకు అత్యధిక నిధులు మండలానికి కేటాయించి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందజేయడంలో కృషి చేస్తానన్నారు. వృద్ధులకు పెన్షన్ రూ.2016, నిరుద్యోగులకు వికలాంగులకు రూ.3016 అమలు చేస్తామన్నారు. జనవరి నాటికి మండలంలోని ప్రతి చెరువులో నీరు నింపి గోదావరి జలకళ ఉట్టిపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో తాను బాధ్యత తీసుకుంటానని, టిఆర్‌ఎస్  జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సుభాష్‌గౌడ్, ఎంపిపి సుకన్య, జక్కు రమేష్‌గౌడ్, విక్టరీబాబు, ఏరుకొండ శ్రీనివాస్‌గౌడ్, ఉదయ్‌కుమార్‌రెడ్డి, రజినికుమార్, అంచూరి విజయ్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు శరత్‌కుమార్, గొల్లవేణి రాణిరాజు, బండ అనితజీవన్‌రెడ్డి, కొండపాక రఘు, టిఆర్‌ఎస్ నాయకులు కందుకూరి చంద్రమోహన్, తిరుపతిగౌడ్, గంప రవి, భాషబోయిన రాజయ్య, బండారి చేరాలు, గోదరి నారాయణ, సమ్మయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

MLA Ramesh Comments on ZPTC and MPTC Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గులాబీ జెండా ఎగరాలి : ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: