జీవితాంతం టిఆర్ఎస్ తోనే : రాజయ్య

హైదరాబాద్‌ : జీవితాంతం తాను టిఆర్ఎస్ తోనే ఉంటానని స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండదండలతో తాను నాలుగు సార్లు ఎంఎల్ఎగా గెలిచినట్టు రాజయ్య వెల్లడించారు. కెసిఆర్ ఏ బాధ్యత అప్పగించినా, చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా ఎదిగేందుకు కెసిఆర్, కెటిఆర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన […] The post జీవితాంతం టిఆర్ఎస్ తోనే : రాజయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : జీవితాంతం తాను టిఆర్ఎస్ తోనే ఉంటానని స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండదండలతో తాను నాలుగు సార్లు ఎంఎల్ఎగా గెలిచినట్టు రాజయ్య వెల్లడించారు. కెసిఆర్ ఏ బాధ్యత అప్పగించినా, చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా ఎదిగేందుకు కెసిఆర్, కెటిఆర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన తెలిపారు. పార్టీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, సిఎంగా కెసిఆర్ ను ప్రతిపాదించే అవకాశం తనకు ఇవ్వడం తన అదృష్టమని రాజయ్య వెల్లడించారు. కెసిఆర్ తీసుకునే నిర్ణయాలకు కట్టబడి ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ప్రోత్సహించిన కెసిఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని రాజయ్య తేల్చి చెప్పారు.

MLA Rajaiah Comments On CM KCR And KTR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జీవితాంతం టిఆర్ఎస్ తోనే : రాజయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: