రికార్డు స్థాయిలో రక్తదానం

  మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎంఎల్ఎ లక్ష్మారెడ్డి జడ్చర్ల: ఎంఎల్ఎ లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం రికార్డు స్థాయిలో 2222 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో మెగా రక్త దాన, అవయవదాన కార్యక్రమాలను చేపట్టారు. ఎంఎల్ఎ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు రక్తదానం, అవయవదానాలు చేయాలని అప్పుడే మరణించి కూడా జీవించినవారవుతారు. గత 15 సంవత్సరాల నుంచి తన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని రక్తదాన […]

 

మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎంఎల్ఎ లక్ష్మారెడ్డి

జడ్చర్ల: ఎంఎల్ఎ లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం రికార్డు స్థాయిలో 2222 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో మెగా రక్త దాన, అవయవదాన కార్యక్రమాలను చేపట్టారు. ఎంఎల్ఎ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు రక్తదానం, అవయవదానాలు చేయాలని అప్పుడే మరణించి కూడా జీవించినవారవుతారు. గత 15 సంవత్సరాల నుంచి తన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు రక్తం అవసరముంటుంది. రక్తం కృత్రిమంగా తయారు చేయలేమని, మందుల ద్వారా రక్తం తయారు కాబడదని అందుకే ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

జడ్చర్లలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో రక్తదానాన్ని సేకరించడం సంతృప్తికరంగా ఉందన్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన రక్త, అవయవదానం మెగా శిబిరం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. అంతకు ముందు లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి , కుమారుడు స్వరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. సిఎల్‌ఆర్ యువసేన ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపి.బిబి పాటిల్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ బాబ్మి శివకుమార్, పరమటయ్య, ప్రణీల్ చందర్, పెద్ది పెంటయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

MLA participate in mega blood donation program

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: