టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం : పద్మాదేవేందర్ రెడ్డి

MLA Padma Devender Reddyచిన్నశంకరంపేట (మెదక్) : టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామ టిఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి సౌజన్యసుదీర్‌రెడ్డిలకు మద్దతుగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామాలు అభివృద్ది చెందాలంటే టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, గత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్‌పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు విని ప్రజలు మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని  కోరారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని, మెదక్ ఎమ్మెల్యేను తాను ఉన్నానని, మండలంలో టిఆర్‌ఎస్ జడ్పీటీసీ, ఎంపీటీసీలు టిఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆమె కోరారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలభివృద్ది సాకారం అవుతుందని, జడ్పీటీసీ అభ్యర్థిగా పట్లోరి మాధవిరాజును, జంగరాయి ఎంపీటీసీ అభ్యర్థి సౌజన్యసుదీర్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. టిఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన  ఫించన్లు వెయ్యి రూపాయలు నుంచి 2వేల రూపాయలు వచ్చే నెలలో వస్తాయని, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని, అనేక సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ది కార్యక్రమాలు గ్రామాభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సుభాష్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, ఆవుల రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సాన సత్యనారాయణతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ అభ్యర్థి పట్లోరి మాధవిరాజు, చిన్నశంకరంపేట ఎంపీటీసీ అభ్యర్థి రాధికకుమార్‌గౌడ్ భారీ ర్యాలీ నిర్వహించి మహిళలకు బొట్టుపెట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

MLA Padma Devender Reddy Election Campaign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం : పద్మాదేవేందర్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.