పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించండి : గంగుల

కరీంనగర్ రూరల్‌ : పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో శుక్రవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం నుంచి టిఆర్‌ఎస్ జడ్పిటిసి ఆభ్యర్థి పురమల్ల లలిత-శ్రీనివాస్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని, స్థానిక ఆభ్యర్థి పురమల్ల లలిత -శ్రీనివాస్‌కు ఓటు వేసి టిఆర్‌ఎస్ను గెలిపించాలని ఓటర్లను ఆభ్యర్థించారు. కరీంనగర్ మండలం ,కొత్తపల్లి మండలం జడ్పిటిసి,ఎంపిటిసిలను గెలిపించి […] The post పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించండి : గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్ రూరల్‌ : పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో శుక్రవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం నుంచి టిఆర్‌ఎస్ జడ్పిటిసి ఆభ్యర్థి పురమల్ల లలిత-శ్రీనివాస్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని, స్థానిక ఆభ్యర్థి పురమల్ల లలిత -శ్రీనివాస్‌కు ఓటు వేసి టిఆర్‌ఎస్ను గెలిపించాలని ఓటర్లను ఆభ్యర్థించారు. కరీంనగర్ మండలం ,కొత్తపల్లి మండలం జడ్పిటిసి,ఎంపిటిసిలను గెలిపించి కెసిఆర్‌కు కానుక ఇవ్వాలని ఆయన తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని ఎంపిటిసిలు,జడ్పిటిసి స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను  గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ది ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. గ్రామాల్లో గతంలో లేని విధంగా రహదారుల నిర్మాణం చేసిందని,టి ఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని, గ్రామాల్లో టిఆర్‌ఎస్ ఆభ్యర్థులకే ఓటు  వేయాలని,కాంగ్రెస్,బిజెపి ఓటు వేస్తే గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని,శాసన సభ నుంచి పరిషత్ పరకు అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్ ఉంటేనే అభివృద్ది వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు నాణ్యమైన కరెంట్‌ను ఇవ్వలేదని,కరెంట్ లేక మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయాన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి మారిపోయిందని,రైతు బంధు,రైతు భీమా,24 గంటల కరెంట్,రైతు రుణా మాఫి, ఆనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రైతుల అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణలో బీడు భూములు సస్యశామలం కానున్నాయని,తెలంగాణ బంగారు తెలంగాణగా మారడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి టిఆర్‌ఎస్ ఎంపిటిసి ఆభ్యర్థులను,జడ్పిటిసి ఆభ్యర్థులను ఆశీర్వదించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఓటర్లకు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్,ఎంపిపి వాసాల రమేష్,గ్రామ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్, జడ్పీ కో అప్షన్ సభ్యులు జమిలొద్దిన్,నాయకులు కాసెట్టి శ్రీనివాస్,సంపత్ రావు,ఎంపిటిసి ఆభ్యర్థులు ర్యాకం లక్ష్మి-మోహన్,గౌడ తిరుపతి రెడ్డి,నిషాపర్వీన్,శంకర్ గౌడ్,చింతల శ్రీనివాస్,కాల్వ మల్లేశం,ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.

MLA Gangula Kamalakar Election Campaign at Karimnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పరిషత్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించండి : గంగుల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.