చెన్నూర్‌లో సోషల్ మీడియా ఆర్మీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : చెన్నూర్‌లో సోషల్ మీడియా ఆర్మీని తయారు చేస్తామని ఆ నియోజకవర్గం ఎంఎల్‌ఎ బాల్కసుమన్ అన్నారు. 1500 మంది క్రియాశీల కార్యకర్తల ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామన్నారు. తెలంగాణ భవన్‌లో చెన్నూ ర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ విధ్యార్థి, యువజన విభాగం నాయకులకు సోషల్ మీడియా వర్క్ షాప్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఎల్‌ఎ బాల్కసుమన్ మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా వస్తున్న […] The post చెన్నూర్‌లో సోషల్ మీడియా ఆర్మీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/ హైదరాబాద్ : చెన్నూర్‌లో సోషల్ మీడియా ఆర్మీని తయారు చేస్తామని ఆ నియోజకవర్గం ఎంఎల్‌ఎ బాల్కసుమన్ అన్నారు. 1500 మంది క్రియాశీల కార్యకర్తల ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామన్నారు. తెలంగాణ భవన్‌లో చెన్నూ ర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ విధ్యార్థి, యువజన విభాగం నాయకులకు సోషల్ మీడియా వర్క్ షాప్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఎల్‌ఎ బాల్కసుమన్ మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా వస్తున్న సోషల్ మీడియా వార్తాలను తిప్పికొట్టే విధంగా ఉండాలన్నారు. విపక్షాలు కావాలని సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలపై వ్యతిరేక, విష ప్రచారం చేస్తాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థి, యువజన విభాగం నాయకులకు సూచించారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయో, ప్రస్తు తం వాటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చూపేలా ఫోటోలను షేర్ చేయాలన్నారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లు వినియోగిస్తున్నందున ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోసిస్తుందని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసి ఆప్రతిష్ట పాలు చేసేందుకు కొంద రు అదే పనిగా యూట్యూబ్, ఫేస్‌బుక్‌లు వాడుకుంటున్నారన్నారు. అలాంటి వాటిని తిప్పికొట్టే విధం గా విద్యార్థులు, యువజన విభాగం నాయకులు సమాధానం ఇవ్వాలన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. ఏ రకంగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను ఎలా వినియోగించాలో పూర్తిస్థాయిలో శిక్షణా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి శంభీపూర్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్ రావు గౌడ్,తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మంచిర్యాల జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

MLA Balka Suman Took Social Media Training Classes

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చెన్నూర్‌లో సోషల్ మీడియా ఆర్మీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: