కవితను మళ్లీ ఆశీర్వదించండి: బాజిరెడ్డి గోవర్ధన్

జక్రాన్‌పల్లి ః నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించి ఎంపీగా మళ్లీ ఆశీర్వదించాలని రూరల్ ఎంఎల్ఏ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను కొరారు. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా గెలుపొందిన కవిత జిల్లా అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ పార్లమెంట్‌లో జిల్లా సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలను కూడా గలమేత్తి పోరాడిన ఘనత మన కవితకే దక్కిందన్నారు. రైతుల […] The post కవితను మళ్లీ ఆశీర్వదించండి: బాజిరెడ్డి గోవర్ధన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జక్రాన్‌పల్లి ః నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించి ఎంపీగా మళ్లీ ఆశీర్వదించాలని రూరల్ ఎంఎల్ఏ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను కొరారు. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా గెలుపొందిన కవిత జిల్లా అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ పార్లమెంట్‌లో జిల్లా సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలను కూడా గలమేత్తి పోరాడిన ఘనత మన కవితకే దక్కిందన్నారు. రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులను కలిసి ప్రధానికి లేఖలు రాయించి కేంద్రంలో ఉన్న ప్రతి మంత్రిని కలిసి పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న విషయాన్ని కొందరు రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రం మెడలువంచి పసుపుబోర్డు సాధిస్తామన్నారు. దీనికి రైతులు, ప్రజలు కవితను ఆదరించి కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా అభివృద్దిలో భాగంగా జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

మండలంలో పలు గ్రామాల్లో రైతు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యంగా కేశ్‌పల్లి గ్రామంలో రైతులకు పట్టాపాస్‌పుస్తకాలు త్వరలో అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్వయాన ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని రైతులను కోరారు. మండల రైతాంగానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని అందులో భాగంగా మండలానికి సాగునీరు అందించడానికి గుత్పలిప్ట్ పనులు కొనసాగుతున్నాయని అదే విధంగా కాళేశ్వరం నుండి పైప్‌లైన్ ద్వారా మండలానికి సాగునీరు అందించి సాగునీటి కొరతలేకుండా కృషి చేసిన కవితను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కొరారు. ఈ కార్యక్మరంలో ఎంఎల్ సి విజిగౌడ్, మాజీ ఎంఎల్ సి అరికెల నర్సారెడ్డి, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, ఎంపిపి అప్పాల పెద్దరాజన్న, జడ్పిటిసి తనూజరెడ్డి, సర్పంచ్ చంద్రకళ, గడిల శ్రీరాములు, బాజిరెడ్డి జగన్, ఎల్‌ఎంబి రాజేశ్వర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
 ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ నాయకుల చేరిక ః
ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో నిర్వహించిన టిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రచార సభలో ఎంపీ కవిత, ఎంఎల్ఏ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అర్గుల్ గ్రామ సర్పంచ్ గోర్తపద్మ, ఉపసర్పంచ్ మాజీ సర్పంచ్‌లు ఫోరం జిల్లా అధ్యక్షులు రాజేంధర్, భూలక్ష్మి, కలిగోట్ ఎంపిటిసి సునీత, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ మహిపాల్‌రెడ్డిలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువకప్పి పార్టీలోకి ఎంపీ కవిత ఆహ్వనించారు.
టిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన రైతు ఎంపీ అభ్యర్థి
పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోసం నిరసనగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన రైతు గుమ్మెర్ల బొర్రన్న టిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతు తెలిపారు. మండల కేంద్రంలో ఎంపీ కవిత నిర్వహించి ప్రచార సభలో రైతు బొర్రన్న మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే రైతులకు మేలు జరుగుతుందన్న నమ్మకంతో టిఆర్‌ఎస్ ఎంపీ కవితకు మద్దతు తెలుపుతున్నమన్నారు.

MLA Bajireddy Govardhan Speech At Election Campaign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కవితను మళ్లీ ఆశీర్వదించండి: బాజిరెడ్డి గోవర్ధన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: