మిషన్ మంగళయాన్.. ఓ అద్భుత ఘట్టం

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) చరిత్రలోనే ‘మిషన్ మంగళ్‌యాన్’ ఓ అద్భుత ఘట్టం. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్రను లిఖించింది. ఈ మిషన్ వెనుక ఇస్రోకు చెందిన ఎంతోమంది శాస్త్రవేత్తల కష్టం ఉంది. మంగళ్‌యాన్ మిషన్‌ను తలపెట్టిన దగ్గర నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం, ప్రయోగ సమయంలో ఉన్న ఉత్కంఠ, మొత్తంగా ఈ ప్రయోగం వెనుక జరిగిన కథను దేశ ప్రజలకు తెలియజేయడం […] The post మిషన్ మంగళయాన్.. ఓ అద్భుత ఘట్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) చరిత్రలోనే ‘మిషన్ మంగళ్‌యాన్’ ఓ అద్భుత ఘట్టం. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్రను లిఖించింది. ఈ మిషన్ వెనుక ఇస్రోకు చెందిన ఎంతోమంది శాస్త్రవేత్తల కష్టం ఉంది. మంగళ్‌యాన్ మిషన్‌ను తలపెట్టిన దగ్గర నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం, ప్రయోగ సమయంలో ఉన్న ఉత్కంఠ, మొత్తంగా ఈ ప్రయోగం వెనుక జరిగిన కథను దేశ ప్రజలకు తెలియజేయడం కోసం సినిమా రూపంలో రాబోతోంది.

ఈ సినిమాలో విద్యాబాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి, నిత్యా మీనన్, హెచ్.ఆర్.దత్తాత్రేయ ఇస్రో శాస్త్రవేత్తలుగా కనిపించనున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న మంగళయాన్ రాకెట్ కోసం లెక్కపెట్టే కౌంట్‌డౌన్‌తో ఈ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. 10 నుంచి 1 వరకు లెక్కించే సమయంలోనే పాత్రలన్నింటినీ పరిచయం చేసేశారు. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్‌యాన్ మిషన్’ నేపథ్యంలో సాగే చిత్రమిది.

Mission Mangal Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మిషన్ మంగళయాన్.. ఓ అద్భుత ఘట్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: