మిషన్ భగీరథ నీరు వృధా…

  పిట్లం : మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో నీరంతా నేలపాలు అవుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చమైన నీటిని అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టగా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో నీరంతా వృధాగా పోతుండటం గమనార్హం. గత రెండు రోజులుగా ఇదే తంతు కొనసాగుతూ స్వచ్చమైన నీరంతా వృధాగా పోతుండటంతో గ్రామస్తులు సంబంధిత అధికారులపై తీవ్ర […] The post మిషన్ భగీరథ నీరు వృధా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పిట్లం : మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో నీరంతా నేలపాలు అవుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చమైన నీటిని అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టగా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో నీరంతా వృధాగా పోతుండటం గమనార్హం.

గత రెండు రోజులుగా ఇదే తంతు కొనసాగుతూ స్వచ్చమైన నీరంతా వృధాగా పోతుండటంతో గ్రామస్తులు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృధాగా పోతున్నా ఇంత నిర్లక్ష్యం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల నీరు దొరుకక వ్యవసాయ పంట పొలాలు, అద్దె బోర్ల ద్వారా నీటిని అందిస్తున్న తరుణంలో స్వచ్చమైన నీరు ఇలా వృధా కావడంతో పలువురు సంబంధిత అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. వేసవి కాలంలో గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న ప్రజలు, మూగ జీవాల బాధలు వారికేం తెలుసని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి వృధాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Mission Bhagiratha Water pipeline leakes in Pitlam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మిషన్ భగీరథ నీరు వృధా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: