మిర్చి@18,500

  హైదరాబాద్: రాష్ట్రంలో మిర్చి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాలు తేజ మిర్చి రూ.18,500, యూఎస్ 341 రకం రూ. 14,500 రికార్డు ధర నమోదైంది. ఖరీఫ్‌లో 1.23 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఈసారి సీజన్ ప్రారంభంలోనే అన్నదాతకు మంచి ధర లభిస్తోంది. ఈ ఏడాది అధిక వర్షాలకు కొంత పంటలు దెబ్బతిన్నాయని అన్ని బాగుంటే ఎకరాకు కనీసం 30 క్వింటాల్ మిర్చి దిగుబడి వచ్చేదంటున్నారు. అయితే ప్రస్తుతం ఎకరాకు […] The post మిర్చి@18,500 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాష్ట్రంలో మిర్చి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాలు తేజ మిర్చి రూ.18,500, యూఎస్ 341 రకం రూ. 14,500 రికార్డు ధర నమోదైంది. ఖరీఫ్‌లో 1.23 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఈసారి సీజన్ ప్రారంభంలోనే అన్నదాతకు మంచి ధర లభిస్తోంది. ఈ ఏడాది అధిక వర్షాలకు కొంత పంటలు దెబ్బతిన్నాయని అన్ని బాగుంటే ఎకరాకు కనీసం 30 క్వింటాల్ మిర్చి దిగుబడి వచ్చేదంటున్నారు. అయితే ప్రస్తుతం ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్లే వస్తుందన్నారు. మార్కెట్లో ధరలు చూస్తే రైతుకు గిట్టుబాటుగా ఉన్నాయి. అయితే మిర్చి పూర్తిగా అమ్ముకునేంత వరకు ఈ ధరలే ఉంటే ఈసారి మంచి లాభాలు ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి మంచి ధర లభిస్తుందని, రైతులు మార్కెట్‌కు వచ్చేముందే రేట్లపై అవగాహనతో రావాలని అధికారులు సూచిస్తున్నారు.

ఒకవేళ తక్కువ ధరలు ఉన్నట్లయితే, కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరుచుకుని గిట్టుబాటు ధర ఉన్నప్పుడే అమ్ముకోవాలని చెబుతున్నారు. అవసరమైతే రైతులకు రూ. 2 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మిర్చి పంట సరిపడ అందుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో మిర్చి వాడకం అధికంగా ఉండటం వల్లే ధర పెరుగుతుందని పేర్కొంటున్నారు. చలికాలంలోనూ మిర్చి వాడకం సాధారణంగా ఎక్కువగానే ఉండటం కూడా మిర్చి పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.

ఉత్పత్తిలో రెండోస్థానం
వాణిజ్య పంట మిర్చి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో కీలకపాత్ర పోషిస్తున్నది. దేశవ్యాప్తంగా 8.4 లక్షల హెక్టార్లలో మిర్చి సాగవుతుండగా, 20.96 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తున్నది. సగటున హెక్టారుకు 2.49 టన్నుల దిగుబడి నమోదయింది. 79.59 వేల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణంతో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో ఉండగా, ఉత్పత్తి విషయంలో 3.98 లక్షల మెట్రిక్ టన్నులతో రెండోస్థానంలో ఉన్నది.

కాగా, జాతీయ సగటు దిగుబడి 2.49 టన్నులు కాగా.. తెలంగాణ 5 టన్నుల దిగుబడితో దేశంలో ముందు వరుసలో ఉన్నది. దేశంలో మిర్చి సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌లో 209.35 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుండగా, 9.92 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రథమస్థానంలో ఉన్నది. తెలంగాణలో ఏటా రూ.305.64 కోట్ల విలువైన 33,960 మెట్రిక్ టన్నుల మిర్చిని వినియోగిస్తుండగా.. మిగిలిన 3,63,990 మెట్రిక్ టన్నులను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల రూ.3,275.91 కోట్ల ఆదాయం లభిస్తున్నది.

Mirchi record price in Warangal Enumamula market

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మిర్చి@18,500 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: