బిగ్‌బాస్కెట్‌లోకి 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులు

  ముంబై: దేశీయ ఆన్‌లైన్ కిరాణ సరుకుల విక్రయ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. మిరే అస్సెట్ ఆసియా గ్రోత్‌ఫండ్, అలీబాబా, బ్రిటన్‌కు చెందిన సిడిసి గ్రూప్‌లు దాదాపు 150 మిలియన్ డాలర్లు బిగ్‌బాస్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈమేరకు సంస్థ సహ వ్యవస్థాపకుడు విపుల్ పరేఖ్ మీడియాతో తెలిపారు. ఈ మొత్తాన్ని కంపెనీ గోదాములు, రవాణ సౌకర్యాలు మెరుగు పర్చి డెలివరీ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా ఆన్‌లైన్ కిరాణ వ్యాపారం […] The post బిగ్‌బాస్కెట్‌లోకి 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: దేశీయ ఆన్‌లైన్ కిరాణ సరుకుల విక్రయ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. మిరే అస్సెట్ ఆసియా గ్రోత్‌ఫండ్, అలీబాబా, బ్రిటన్‌కు చెందిన సిడిసి గ్రూప్‌లు దాదాపు 150 మిలియన్ డాలర్లు బిగ్‌బాస్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈమేరకు సంస్థ సహ వ్యవస్థాపకుడు విపుల్ పరేఖ్ మీడియాతో తెలిపారు. ఈ మొత్తాన్ని కంపెనీ గోదాములు, రవాణ సౌకర్యాలు మెరుగు పర్చి డెలివరీ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్టు తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా ఆన్‌లైన్ కిరాణ వ్యాపారం వృద్ధిని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. అయితే ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నందున పెట్టుబడి వివరాలను సంస్థ వెల్లడించలేదు. బిగ్‌బాస్కెట్‌లో అలీబాబా ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, అతిపెద్ద ఇన్వెస్టర్‌గా నిలిచింది.

Mirae Naver, Alibaba, CDC invest $150 million in BigBasket

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిగ్‌బాస్కెట్‌లోకి 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: