మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

  మన తెలంగాణ/ హైదరాబాద్: మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలతో పాటు పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం గురుకులాల సంస్థ నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇందులో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం, ఐదవ తరగతి ప్రవేశానికి సంబంధించిన ఫలితాలను గురువారం విడుదల చేశారు. దీంతో పాటు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో రు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను కూడా వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో […] The post మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/ హైదరాబాద్: మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలతో పాటు పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం గురుకులాల సంస్థ నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇందులో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం, ఐదవ తరగతి ప్రవేశానికి సంబంధించిన ఫలితాలను గురువారం విడుదల చేశారు. దీంతో పాటు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో రు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను కూడా వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 5,471 మంది విద్యార్థులు హాజరు కాగా ందులో 843 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు మైనార్టీ గురుకుల పాఠశాలల సంస్థ కార్యదర్శి షఫిఉల్లా తెలిపారు.

పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవు తుందన్నారు. ఐదవ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 27,071 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులో11,359 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇక ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 5,470 మంది హాజరు కాగా ఇందులో 3,948 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు కార్యదర్శి తెలిపారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రవేశాల కోసం సంబంధిత పాఠశాలలను సంప్రదించాల ని సూచించారు. అభ్యర్థులు టిఎంఆర్ విద్యా సంస్థల్లో ఫలితాలు తెలుసుకోవచ్చని లేదా tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.

Minority Gurukulam school entrance results release

The post మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: