కేసీఆర్ టీంలోకి కేటీఆర్.. గంగుల..

  మంత్రివర్గ విస్తరణలో మరో ఇద్దరికి చోటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర క్యాబినెట్‌లో మొత్తం నలుగురు ప్రమాణస్వీకారం చేయించిన నూతన గవర్నర్ తమిళిసై రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్‌కు అత్యధిక ప్రాధాన్యత కేటీఆర్‌కు ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖలు ‘గంగుల’కు బిసి సంక్షేమం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు రాష్ట్ర మంత్రివర్గ మలి విడత విస్తరణలో ఆరుగురికి మంత్రి పదవులు కేటాయించగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మరో ఇద్దరికి చోటు దక్కింది. రాజన్న సిరిసిల్ల […] The post కేసీఆర్ టీంలోకి కేటీఆర్.. గంగుల.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మంత్రివర్గ విస్తరణలో మరో ఇద్దరికి చోటు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర క్యాబినెట్‌లో మొత్తం నలుగురు
ప్రమాణస్వీకారం చేయించిన నూతన గవర్నర్ తమిళిసై
రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్‌కు అత్యధిక ప్రాధాన్యత
కేటీఆర్‌కు ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖలు
‘గంగుల’కు బిసి సంక్షేమం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు

రాష్ట్ర మంత్రివర్గ మలి విడత విస్తరణలో ఆరుగురికి మంత్రి పదవులు కేటాయించగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మరో ఇద్దరికి చోటు దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుతో పాటు బిసి సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌కు చోటు దక్కింది. నూతన తొలి మహిళా గవర్నర్‌గా ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ ఐటి, పురపాలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం కూడా అదే శాఖను కేటాయించారు. గంగుల కమలాకర్‌కు బిసి సంక్షేమ, సివిల్ సప్లయి, వినియోగ దారుల వ్యవహారాల శాఖలను ముఖ్యమంత్రి కెసిఆర్ కేటాయించారు. బిసి సామాజిక వర్గా నికి చెందిన గంగుల కమలాకర్‌కు రెండవ విడత మంత్రి వర్గ విస్తరణలో చోటు లభించింది.

ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన ఇద్దరితో కలిపి రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల సంఖ్య నాలుగుకు చేరగా ఇటీవలే కరీంనగర్ మాజీ ఎంపి వినోద్‌కుమార్‌కు సైతం కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ముఖ్యమంత్రి నియ మించడంతో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరోఇద్దరికి మంత్రి పదవులు వరించడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.

రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగల కమలాకర్‌లకు చోటు దక్కింది. సిరిసిల్ల నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మొదటిసారిగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా చేసిన రాజీనామాల అనంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో రెండవ సారి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన 2014 ఎన్నికలతో పాటు, 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. గత ప్రభుత్వంలో 2014 నుండి 18 వరకు రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖల మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు.

రెండవ సారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖలు కేటాయించారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన గంగుల కమలాకర్ వరుసగా మూడు పర్యాయాలు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టిడిపి తరుఫున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో టిడిపికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 జరిగిన ఎన్నికల్లో సైతం కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా బిసి సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌కు సిఎం కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టి సముచిత స్థానాన్ని కల్పించారు.

గంగుల కమలాకర్‌కు బిసి సంక్షేమం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలను ముఖ్యమంత్రి కేటాయించారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో నూతన తొలి మహిళా గవర్నర్‌గా ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ సాయంత్రం 4.14 నిముషాలకు వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుండి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన ఇద్దరితో కలిపి రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల సంఖ్య నాలుగుకు చేరగా ఇటీవలే కరీంనగర్ మాజీ ఎంపి వినోద్‌కుమార్‌కు సైతం క్యాబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ముఖ్యమంత్రి నియమించడంతో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరోఇద్దరికి మంత్రి పదవులు వరించడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.

సిఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా ః
నాకు రెండు సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించి పోటీ చేసే అవకాశం ఇవ్వడమే కాకుండా మలి విడత మంత్రి వర్గ విస్తరణలో స్థానం కల్పించడం పట్ల సిఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతాను. నాకు కేటాయించిన బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖకు న్యాయం చేస్తాను. సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లి అర్హులందరికీ పథకాలు చేరేలా నా వంతు కృషి చేస్తా.

మూడు సార్లు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు గెలిపించడం పట్లనే నాకు మంత్రి పదవిలో సిఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటా. సిఎం కేసీఆర్ నాపై నమ్మకంతో మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించినందుకు, అందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

Ministerial posts to KTR and Gangula

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కేసీఆర్ టీంలోకి కేటీఆర్.. గంగుల.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.