ప్రజల భాగస్వామ్యంతో పట్టణాల అభివృద్ధి

  భీమ్‌గల్: ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. భీమ్‌గల్‌ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భీమ్‌గల్ పట్టణంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అర్హులైన వారికి పెన్షన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో […] The post ప్రజల భాగస్వామ్యంతో పట్టణాల అభివృద్ధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భీమ్‌గల్: ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. భీమ్‌గల్‌ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భీమ్‌గల్ పట్టణంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అర్హులైన వారికి పెన్షన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

ప్రజల నుంచి చెత్తను సేకరించేందుకు రెండు ట్రాక్టర్లను త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. భీమ్‌గల్‌లో రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడంతో పాటు శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లతా, మున్సిపల్ చైర్‌పర్సన్ రాజశ్రీ, విద్యుత్‌శాఖ ఎస్‌ఇ సుదర్శనం , డిసిఒ సింహాచలం, సిఇఒ గోవింద్, కమిషనర్ గంగాధర్, ఆర్‌డిఒ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Minister Vemula Prashanth Reddy visits Bheemgal town

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రజల భాగస్వామ్యంతో పట్టణాల అభివృద్ధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: