అన్ని వర్గాల ప్రజల సంతోషం కోసం కృషి…

సంగారెడ్డి: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పలు పథకాలు తీసుకువచ్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టిఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల సంతోషం కోసం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తలసాని ఎంఎల్ఎ చింత ప్రభాకర్ తో కలిసి సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువులో బుధవారం చేప పిల్లలను వదిలారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు పాడి గేదెలు, గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గురుకుల పాఠశాలలు […]

సంగారెడ్డి: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పలు పథకాలు తీసుకువచ్చిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టిఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల సంతోషం కోసం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తలసాని ఎంఎల్ఎ చింత ప్రభాకర్ తో కలిసి సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువులో బుధవారం చేప పిల్లలను వదిలారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు పాడి గేదెలు, గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలియజేశారు. సబ్సిడీపై పాడి గేదెలు, గొర్రెలు, ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రైతన్నలకు ఎకరానికి 8 వేల పెట్టుబడి సహాయంతోపాటు, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు రూ.5 లక్షలు బీమా చేయించిందన్నారు. కాంగ్రెస్ అన్ని పార్టీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విమర్శలు గుప్పిస్తున్నారని తలసాని గరం అయ్యారు. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఇంజనీర్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారని  మంత్రి తలసాని చెప్పారు.

Comments

comments

Related Stories: