కంటనీరు పెట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకల్ల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కంటనీరు పెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంతో పాటు స్థానిక క్లాక్ టవర్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద మంత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో చాలా మంది ప్రాణ త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు తరతరాలు మరువవని, వారి త్యాగాలు వృధా కావంటూ ఆయన భావోద్వేగానికి […] The post కంటనీరు పెట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకల్ల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కంటనీరు పెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంతో పాటు స్థానిక క్లాక్ టవర్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద మంత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో చాలా మంది ప్రాణ త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు తరతరాలు మరువవని, వారి త్యాగాలు వృధా కావంటూ ఆయన భావోద్వేగానికి గురై కంటనీరు పెట్టుకున్నారు. దీంతో ఈ వేడుకలకు హాజరైన వారు కూడా బావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ సాధన దిశలో సిఎం కెసిఆర్ సాగుతున్నారని ాయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల బాగు కోసం కెసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కంటనీరు పెట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: