మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పాదయాత్ర

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్, శ్రీరామ కాలనీ లలో తెలంగాణ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ,  పోలీస్ అధికారులతో కలిసి మంగళవారం పాదయాత్ర చేశారు. రోడ్లు, డ్రైన్ సమస్యలపై మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లల్లో సిసి రోడ్లు, డ్రైన్ లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలనీలోని గుడిసె వాసులకు కూడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని ఆయన  […] The post మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పాదయాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్, శ్రీరామ కాలనీ లలో తెలంగాణ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ,  పోలీస్ అధికారులతో కలిసి మంగళవారం పాదయాత్ర చేశారు. రోడ్లు, డ్రైన్ సమస్యలపై మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లల్లో సిసి రోడ్లు, డ్రైన్ లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలనీలోని గుడిసె వాసులకు కూడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని ఆయన   పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. శ్రీ రామ కాలనీ లో రూ.20లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యశోద, ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కె.వెంకటయ్య, రాజేశ్వర్, నవకాంత్, పురుషోత్తం, పల్లె రాజు  తదితరులు పాల్గొన్నారు.
Minister Srinivas Goud Padayatra in Mahabubnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పాదయాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: