నాది రైతు కుటుంబమే.. ఇప్పటికీ సాగు చేస్తున్నా

శాస్త్రీయ పద్ధతిలో మార్కెటింగ్‌పై దృష్టి పెడతా వ్యవసాయ శాఖను నిర్వహించడం అతిపెద్ద బాధ్యత మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖను నిర్వహించడం అతిపెద్ద బాధ్యత అని, సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతానని తెలంగాణ రాష్ట్ర రెండో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగం సమస్యలను తీర్చి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా శాస్త్రీయ పద్దతిలో మార్కెటింగ్‌పై దష్టి పెడతామన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం మంత్రిగా […]

శాస్త్రీయ పద్ధతిలో మార్కెటింగ్‌పై దృష్టి పెడతా
వ్యవసాయ శాఖను నిర్వహించడం అతిపెద్ద బాధ్యత
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖను నిర్వహించడం అతిపెద్ద బాధ్యత అని, సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతానని తెలంగాణ రాష్ట్ర రెండో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగం సమస్యలను తీర్చి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా శాస్త్రీయ పద్దతిలో మార్కెటింగ్‌పై దష్టి పెడతామన్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆయనకు సిఎం వ్యవసాయ శాఖను కేటాయించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డితో ‘మన తెలంగాణ ప్రతినిధి’ మాట్లాడగా తన ఆలోచనలను పంచుకున్నారు. ఎంఎల్‌ఎగా గెలిచిన మొదటిసారే తన కు మంత్రిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాన్నా రు. రాష్ట్రంలోని రైతులకు, ప్రజలకు సేవ చేసేలా వ్యవసాయ శాఖ కేటాయించిన సిఎంకు ధన్యవాదాలు తెలిపారు.

శక్తివంచన లేకుండా పనిచేస్తా
పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రాసెసింగ్ చేయడం వంటివి పెద్ద బాధ్యతో కూడినవి.ఈ బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తున్నా. రైతుల సమస్యలు పరిష్కరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. స్వయంగా తని రైతు కుటుంబంమని, న్యా యవాదిగా, రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ వ్యవసాయా న్ని ప్రాణప్రదంగా భావించి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నా.. రైతు గోస కల్లారా చూసినవాడిని. అందుకే తెలంగాణ జెండా పట్టిన అని తెలిపారు. సాగు విస్తరణ, మార్కెటింగ్, సరఫరా రంగాలపై దృష్టి పెడతా. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లోకి అందించేలా ప్రణాళికలను రూపొందిస్త్తామన్నారు.

ప్రభుత్వం ఆశించే ఫలితాలు సాధిస్తాం
రైతు సమన్వయ సమితులను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తా. రైతు సమన్వయ సమితులకు విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆశించే ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. త్వర లో కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. సాగునీటిని హేతుబద్దంగా వినియోగించేలా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. తెలంగాణ వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల కాలనీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తామన్నారు. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్లు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు.

Minister Singireddy Niranjan Reddy Speech

Related Stories: