ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha Indra Reddy Cleaned His House

 

హైదరాబాద్ : వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దోమల ద్వారా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు, పది నిమిషాల పాటు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీనగర్ కాలనీలోని తమ నివాసంలో వివిధ రకాల మొక్కల కుండీలను శుభ్రం చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నీటి నిల్వ ఉండే డ్రమ్ములు,కూలర్‌లలో వారంలో ఒకసారి పూర్తిగా నీళ్లు తీసేసి శుభ్రం చేసుకుని వాడుకోవాలని, లేనట్లయితే అందులో లార్వా వృద్ధి చెంది తద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మలేరియా, డెంగ్యూ , చికెన్ గున్యా ,ఫైలేరియా, మెదడువాపు తదితర సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.

ఇళ్లు, ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, కాఫీ, టీల కోసం వాడి పారేసే ప్లాస్టిక్ కప్పులు ,పాత కూలర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇంటిముందు ఉండే రోళ్లు, ఇంటి ముందు నీటి గుంతలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ తెలంగాణ కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఫ్రైడేను డ్రై డేగాను కూడా విజయవంతం చేయాలని కోరారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.