ఆర్టీసి బస్సులో ప్రయాణించిన మంత్రి పువ్వాడ

Puvvada-Ajay-Kumar

ఖమ్మం: రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఆర్టీసి బస్సు ఎక్కారు. ఒక సామాన్యుడి ప్రయాణికుడి మాదిరిగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు సూపర్ లగ్జరి నాన్ ఎస్సీ బస్సులో ప్రయాణించారు. ఖమ్మం ఎంపి నామ నాగేశ్వర్‌రావు,వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి ఆయన ప్రయాణించారు.పాల్వంచలో జరిగే రెండో విడత పల్లె ప్రగతి అవగాహన సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు ఆర్టీసి బస్సులో ప్రయాణించారు. ఆర్టీసి సంస్ధను లాభాలబాటలో తీసుకేళ్ళేందుకు చేపట్టుతున్న అనేక సంస్కరణలో భాగంగా ప్రతి ప్రజాప్రతినిధి నెలకు ఒక్కసారి అయినా ఆర్టీసి బస్సులో ప్రయాణీంచాలని ఆర్టీసి సంస్ధ ఇటివల నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈమేరకు రవాణ శాఖ మంత్రి హోదాలో పువ్వాడ అజయ్‌కుమార్ ఎంపి,ఎమ్మెల్యేలకు లేఖలను రాశారు.

అయితే మంత్రిగా ముందుగా తానే అచరించాలనే ఉద్దేశ్యంతో ఆయన సామాన్య ప్రయాణీకుడిగా బస్సులో ప్రయాణించారు. మంత్రికి,ఎమ్మెల్యేకు సంబంధించిన టిక్కెట్‌ను ఎంపి నామ నాగేశ్వర్‌రావు తీసుకున్నారు.ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ బస్సులో ఎక్కిన ప్రయాణీకులతో మాట్లాడి వారి సలహాలను ,సూచనలు స్వీకరించారు. మద్య మద్యలో ఎక్కే దిగే ప్రయాణీకులతో ఆయన సంభాషించారు. ఆర్టీసి బస్సులో ప్రయాణీకులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంపై ఆరా తీశారు. ఆర్టీసి ప్రయాణం సురక్షితమని ఆయన చెప్పారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతోమాట్లాడ్తూ మంత్రులు,ప్రజాప్రతినిధులు నెలలో కనీసం ఒక్కసారి అయినా ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తే ప్రజలకు స్పూర్తినిచ్చిన వారం అవుతామని దీని వల్ల ఆటోల్లో, ఇతర ప్రయివేట్ వాహనాల్లో వేళ్ళే ప్రయాణీకులంతా ఆర్టీసి బస్సును ఎక్కే అవకాశం ఉందన్నారు. బస్సులో ఆక్యుపేన్షి రేషియోను పెంచేందుకు పలు చర్యలు తీసుకోబోతున్నామన్నారు. అనేక సంస్కరణల ద్వారా ఆర్టీసిని లాభాల బాటలోకి తీసుకేళ్ళే ప్రయత్నం చేస్తున్నామన్నారు.నష్టాల్లోఉ న్న డిపోలను ఆర్టీసి ఉన్నతాధికారులు దత్తత తీసుకొని లాభాలోకి తీసుకేళ్ళే బాధ్యతలను అప్పగించామన్నారు. సంస్ధను లాభాల్లోకి తీసుకరావడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.

ఆర్టీసి సంస్ధ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి కార్గో సేవలను ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. సంస్దను లాభాల బాటలోకి తీసుకోచ్చేందుకు అనేక సంస్కరణలు చేపట్టుతున్నామని అందులో భాగంగా గూడ్స్ పార్శిల్ సర్వీస్‌ను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్టీసి సంస్ధకు బ్రాండ్ అంబాసిడర్ అయిన కెసిఆర్ అదేశం మేరకు అనేక సంస్కరణలు చేపడుతున్నామన్నారు.ఇప్పటికే ఆర్టీసి కార్మికులందరిని ఉద్యోగులగా గుర్తించామని,మహిళా ఉద్యోగులు రాత్రి 8గంటల వరకేడ్యూటీ చేసే విధంగా అదేశాలను జారీ చేసి అమలు చేస్తున్నామన్నారు.సంస్ధలో మంచి వాతవరణం కల్పించేందుకు ఈనెల 24న హైద్రాబాద్‌లో ఆర్టీసి ఉద్యోగులతో వనభోజనాల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

Minister Puvvada Ajay Kumar Travels in RTC Bus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్టీసి బస్సులో ప్రయాణించిన మంత్రి పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.