రైతుబంధు తెలంగాణ ప్రభుత్వం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని బోనకల్లు మండల కేంద్రంలో శనివారం ఆయన రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రతిపాదించిన నియంత్రిత పంటలను సాగు చేసి అధిక లాభాలు గడించాలని మంత్రి రైతులకు […] The post రైతుబంధు తెలంగాణ ప్రభుత్వం : మంత్రి పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని బోనకల్లు మండల కేంద్రంలో శనివారం ఆయన రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రతిపాదించిన నియంత్రిత పంటలను సాగు చేసి అధిక లాభాలు గడించాలని మంత్రి రైతులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పాస్టర్స్‌కు మంత్రి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సరుకులను అందించిన పాస్టర్ సత్యపాల్‌ను ఆయన అభినందించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం సూచించిన నిబంధనలను విధిగా పాటించాలని, భౌతికదూరం పాటించడంతో పాటు విధిగా మాస్క్‌లు ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రైతుబంధు తెలంగాణ ప్రభుత్వం : మంత్రి పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: