ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి : పువ్వాడ

ఖమ్మం : ప్రజల సహకారంతోనే రాష్ట్రంలో కరోనా కట్టడి సాధ్యమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బయటకొచ్చినప్పుడు ప్రజలు భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్‌లు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన ఖమ్మం జడ్‌పి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం జడ్‌పి చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఖమ్మం జిల్లా పరిధిలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న కలెక్టర్ […] The post ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి : పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : ప్రజల సహకారంతోనే రాష్ట్రంలో కరోనా కట్టడి సాధ్యమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. బయటకొచ్చినప్పుడు ప్రజలు భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్‌లు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన ఖమ్మం జడ్‌పి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం జడ్‌పి చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఖమ్మం జిల్లా పరిధిలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న కలెక్టర్ కర్ణన్, జిల్లా అధికారులను మంత్రి అభినందించారు. వానాకాలంలో సాగు చేసే పంటలు, ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతు వేదికల నిర్మాణం వంటి అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సిఎం కెసిఆర్ చెప్పిన విధంగా నియంత్రిత పంటలను సాగు చేసి, అధిక లాభాలు పొందాలని ఆయన రైతులకు సూచించారు. గిట్టబాటు రాని పంటల వల్ల ఎటువంటి లాభం లేదని, ప్రభుత్వం చెప్పిన పంటలనే వేసి అధిక లాభాలను ఆర్జించాలని ఆయన చెప్పారు.

The post ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి : పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: