ఎస్సారెస్పీకి రోజుకో టిఎంసి నీటిని తరలిస్తాం: వేముల ప్రశాంత్ రెడ్డి

  నిజామాబాద్: పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీకి రోజుకో టిఎంసి చొప్పున నీటిని తరలిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి పలు కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు 50 వేల కోట్ల రూపాయలతో ఎంతో పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. ప్రాణహిత గోదావరి నదుల నీటిని వెనుక నుంచి రివర్స్ గా తోడి ఎత్తిపోతల […] The post ఎస్సారెస్పీకి రోజుకో టిఎంసి నీటిని తరలిస్తాం: వేముల ప్రశాంత్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్: పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీకి రోజుకో టిఎంసి చొప్పున నీటిని తరలిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి పలు కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు 50 వేల కోట్ల రూపాయలతో ఎంతో పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. ప్రాణహిత గోదావరి నదుల నీటిని వెనుక నుంచి రివర్స్ గా తోడి ఎత్తిపోతల ద్వారా అందిస్తున్నారని దీనికి మొదటగా నిజామాబాద్ జిల్లాకు ఈ ఫలాలు అందనున్నాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 30 టిఎంసిల నీటిని ఈ సీజన్లో నింపే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా రైతాంగానికి సాగు, తాగు నీటి కష్టాలు తిరనున్నాయని, అభివృద్ధి నిరోధకులు ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకే సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Minister Prashanth Reddy speech on kaleshwaram project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్సారెస్పీకి రోజుకో టిఎంసి నీటిని తరలిస్తాం: వేముల ప్రశాంత్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: