సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు అనుమతి

కరోనా లాక్ డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చిత్ర పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పలువురు సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. సీనియర్ స్టార్లు […] The post సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు అనుమతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరోనా లాక్ డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

చిత్ర పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పలువురు సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. సీనియర్ స్టార్లు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, సి.కళ్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకులు రాజమౌళి, వి.వి.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ఎన్.శంకర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ “లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే షూటింగ్‌లను నిలిపివేయడం జరిగింది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14 వేల మందికి కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినిమా షూటింగ్‌లు, సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా థియేటర్‌లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలి. లాక్ డౌన్ సమయంలో షూటింగ్‌లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియోను ప్రభుత్వానికి సమర్పిస్తాము”అని పేర్కొన్నారు.

దీనికి స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్‌లను ధరించాలి, శానిటైజేషన్ ఉపయోగించాలి, భౌతికదూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తాము. షూటింగ్‌ల నిర్వహణకు, థియేటర్‌లను తెరిచేందుకు సిఎం కెసిఆర్‌తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము ”అని తెలిపారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు అనుమతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: