దుష్ప్రచారాన్ని ఆపండి

mahmood-ali

హైదరాబాద్: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిందని చెప్పారు. కొన్ని రాజకీయపార్టీలు, మీడియా సంస్థలు కావాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయల్ 100కు ఫోన్ చేసి ఉంటే పోలీసులు సరైన సమయంలో బాధితురాలి దగ్గరకు చేరుకునే వారని మరోసారి మంత్రి స్పష్టపర్చారు.

మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేశామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు అసత్య ప్రచారానికి స్వస్తి పలకాలని సూచించారు. బాధితురాలు తన సోదరికి కాకుండా డయల్ 100కు ఫోన్ చేసి ఉండాల్సిందని తన అభిప్రాయంగా ఆయన వ్యక్తపర్చారు. దీంతో పలు మహిళా సంఘాలు, విద్యార్థినులు హోంమంత్రి ప్రకటనపై విరుచుకుపడ్డారు. హోంమత్రి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి మరోసారి వాటిని ఉద్ఘాటించారు.

Minister mahmood ali blames priyanka reddy murder victim

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దుష్ప్రచారాన్ని ఆపండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.