సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన

Minister KTR

 

హైదరాబాద్: సిరిసిల్లలో మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఆకస్మికంగా పర్యటించారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. వికలాంగులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ కెటిఆర్ చేశారు. 30 రోజుల గ్రామ ప్రణాళిక విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా యంత్రాంగాన్ని, సిబ్బందిని, సర్పంచులను అభినందించారు. గ్రామ ప్రణాళిక విజయవంతంగా పూర్తి చేసినందుకు రూ. 4 లక్షల వ్యక్తిగత నిధులతో 1200 మంది పంచాయితీ సిబ్బందికి బీమా ప్రీమియం చెక్కును మంత్రి కెటిఆర్ జిల్లా కలెక్టర్ కు అందించారు.

ఎగువ మానేరు నుంచి దిగువ మానేరు వరకు మానేరు తీరం వెంబడి, జిల్లలోని అన్ని చెరువులు, కాలువల వెంట మొక్కలు నాటేందుకు కార్యచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ నెల వారం రోజల పాటు ప్రజల సహాకారంతో పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. 99 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తియినందున ప్రజలందరికీ పరిశుభ్రమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మినరల్ వాటర్ ప్లాంట్ లలో, వాటర్ బాటిళ్లలో ఉండే నీటికంటే భగీరథ నీరే స్వచ్ఛమైనదని ప్రజటకు మంత్రి కెటిఆర్ వివరించారు.

Minister KTR surprise visit to Rajanna Sircilla

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.