విపత్తు నిర్వహణ వాహనాలను ప్రారంభించిన కెటిఆర్

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి పరిధిలో విపత్తు నిర్వహణ వాహనాలను మంత్రి కెటిఆర్ గురువారం ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో విపత్తు నిర్వహణ వాహనాలను తయారు చేసినట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఒక్కో వాహనంలో ఏడు రకాల రక్షణ పరికరాలు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఒక్కో వాహనంలో ఆరు రకాల బాక్స్‌లు ఉంటాయన్నారు. మెడికల్ కిట్, గమ్ బూట్స్, హెల్మెట్, మిగతా వాటిలో రక్షణ పరికరాలు ఉంటాయని మంత్రి కెటిఆర్ చెప్పారు. 500 మీటర్ల వరకు […] The post విపత్తు నిర్వహణ వాహనాలను ప్రారంభించిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి పరిధిలో విపత్తు నిర్వహణ వాహనాలను మంత్రి కెటిఆర్ గురువారం ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో విపత్తు నిర్వహణ వాహనాలను తయారు చేసినట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఒక్కో వాహనంలో ఏడు రకాల రక్షణ పరికరాలు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఒక్కో వాహనంలో ఆరు రకాల బాక్స్‌లు ఉంటాయన్నారు. మెడికల్ కిట్, గమ్ బూట్స్, హెల్మెట్, మిగతా వాటిలో రక్షణ పరికరాలు ఉంటాయని మంత్రి కెటిఆర్ చెప్పారు. 500 మీటర్ల వరకు వెలుతురు వచ్చేలా ఆస్కా లైట్లను ఈ వాహనాల్లో అమర్చినట్టు ఆయన పేర్కొన్నారు. గురువారం నెక్లెస్ రోడ్డులో జరిగి కార్యక్రమంలో ఆయన ఎనిమిది డిఆర్‌ఎఫ్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు.

Minister KTR Launched Disaster Management Vehicles

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విపత్తు నిర్వహణ వాహనాలను ప్రారంభించిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.