ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను అభినందించిన కెటిఆర్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా టెలి మెడిసిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ నివారణ,లాక్‌డౌన్ ఆంక్షలతో ప్రజల ఇళ్ల్లకే పరిమితమయ్యారు. సాధారణ రోగులు సైతం వైద్యపరీక్షలకు బయటకువచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యశాఖ ఉత్తర్వుల మేరకు ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ సహకారంతో ఖమ్మం జిల్లా టెలి మెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విభాగాల వారిగా వైద్యుల పేర్లు,ఫోన్ నంబర్లు, సంప్రదించాల్సిన సమయాల వివరాలను ప్రజలకు […] The post ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను అభినందించిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా టెలి మెడిసిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ నివారణ,లాక్‌డౌన్ ఆంక్షలతో ప్రజల ఇళ్ల్లకే పరిమితమయ్యారు. సాధారణ రోగులు సైతం వైద్యపరీక్షలకు బయటకువచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యశాఖ ఉత్తర్వుల మేరకు ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ సహకారంతో ఖమ్మం జిల్లా టెలి మెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

విభాగాల వారిగా వైద్యుల పేర్లు,ఫోన్ నంబర్లు, సంప్రదించాల్సిన సమయాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ టెలిమెడిసిన్‌ను ప్రారంభించినట్లు ట్విట్టర్‌లో పోస్టు చేయగా రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. కరోనా నేపథ్యంలో ఇతర వ్యాధుల చికిత్సకోసం రోగులు ఇబ్బందులు పడుతుండటంతో టెలి మెడిసిన్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఖమ్మంలో టెలిమెడిసిన్ ప్రారంభించినట్లు కలెక్టర్ పోస్ట్ చేయగా కెటిఆర్ ట్విట్టర్‌లో అభినందించారు.

Minister KTR Congratulates Khammam District Collector

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను అభినందించిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: