కరోనా కట్టడిలో వైద్యులకు సహకరించండి : కెటిఆర్

Minister KTR Comments On Doctors And Medical Staffరాజన్న సిరిసిల్ల : కరోనా కట్టడిలో విశేష సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను గుర్తించి, వారికి సహకరించాలని మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కెటిఆర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక సివిల్‌ హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది, ప్రజల కోసం లయన్స్‌ ఇంటర్నేషనల్‌ సమకూర్చిన 200 హోం ఐసోలేషన్‌ కిట్లు, శానిటైజర్లు, ఫేస్‌ షీల్డులు, పిపిఇ కిట్లు, 40 గ్రామాలకు బాడీ ఫ్రీజలర్లు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు భేష్ గ్గా ఉన్నాయని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో 72 శాతం మంది రికవరీ అయి ఇళ్లకు వెళ్లారని, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రాణాలకు తెగించి వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా కట్టడిలో భాగంగా చేస్తున్న సేవలను ప్రజలు విస్మరించకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమన్న విషయాన్ని విస్మరించకూడదని ఆయన తేల్చి చెప్పారు. బయటకు వచ్చినప్పుడు విధిగా భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆయన ప్రజలను కోరారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కరోనా కట్టడిలో వైద్యులకు సహకరించండి : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.