కాంగ్రెస్, బిజెపి సంఘ విద్రోహ పార్టీలు

మన తెలంగాణ/ధర్మారం : సంఘ విద్రోహ పార్టీలుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు కాళేశ్వరంపై చర్చకు రావాలని, నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రజాకర్షక ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేసారు. ధర్మారం మండలం నందిమేడారం రిజర్వాయర్ సమీపంలో గురువారం అశేష ప్రజానీకంతో నిర్వహించిన జలజాతర వేదికపై మంత్రి ఈశ్వర్ సవాల్ విసిరాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంపై ప్రతిపక్షాలు అనవసర రాదాంతం చేస్తూ, […] The post కాంగ్రెస్, బిజెపి సంఘ విద్రోహ పార్టీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/ధర్మారం : సంఘ విద్రోహ పార్టీలుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు కాళేశ్వరంపై చర్చకు రావాలని, నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రజాకర్షక ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేసారు. ధర్మారం మండలం నందిమేడారం రిజర్వాయర్ సమీపంలో గురువారం అశేష ప్రజానీకంతో నిర్వహించిన జలజాతర వేదికపై మంత్రి ఈశ్వర్ సవాల్ విసిరాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంపై ప్రతిపక్షాలు అనవసర రాదాంతం చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని 19 రాష్ట్రాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాన్ని పాలిస్తున్న బిజెపి ఏ ఒక్క రాష్ట్రంలోను మూడేళ్లలో బహుళార్థ జాతీయ స్థాయి ప్రాజెక్టు నిర్మించలేదని, నిరంతర విద్యుత్ అందించిన దాఖలు లేవని, ఒక్క కెసిఆర్‌కే సాధ్యం అయ్యిందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వంత డబ్బులతో ప్రాజెక్టు నిర్మించుకుంటే సిఎం కెసిఆర్ అపర భగీరథుడిగా మారి చేసిన ప్రయత్న ఫలమే కాళేశ్వరమని, రూపాయి ఇవ్వకున్నా జాతీయ హోదా కల్పించుకున్న తెలంగాణ ప్రజలు ఓపిక పట్టారని, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి ఈశ్వర్ అన్నారు.

తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత చెవెళ్ళ నిర్మాణాకి పూనుకున్న నాటి కాంగ్రెసు ప్రభుత్వం కోట్లాది రూపాయలు దోచుకున్నారని, నాడు కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లేకున్న కాల్వులు తవ్వి ప్రాజెక్టు నిర్మాణం పేరా నోట్ల కట్టలు పంచుకున్న కాంగ్రెసు నేతలు నీతిమాలిన మాట్లాడుతున్నారని ఈశ్వ ర్ మండిపడ్డారు. ప్రస్తుతం గోదావరి నిండుకుండలా కనిపిస్తుంటే కాంగ్రెసొళ్ళ కళ్ళు మండిపడుతున్నాయని మంత్రి విమర్శించారు. 16 జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు రూ.80,190 వేల కోట్ల వ్యయంతో 142 టిఎంసీల నీటి ద్వారా 42 లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగునీరు అందించేందుకు సీఎం కేసిఆర్ ఆహో రాత్రు లు శ్రమించి కాళేశ్వరం నిర్మించారన్నారు. బాధ్యతయుతమైన పార్టీలుగా వ్యవహరించాలని, కాళేశ్వరంపై విమర్శలు చేసే అజ్ఞానులు నిజాలు తెలుసుకొవాలని ఈశ్వర్ హితవు పలికారు.చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కమిషన్ల ప్రాజెక్ట్ మూతపడి కాళేశ్వరం నిర్మాణం జరగడంతో కాంగ్రెసోళ్ళు ఆగం అవుతున్నారని, బొట్ల్లలో షికారు చేస్తున నేతలు తనతో చర్చకు సిద్ధపడాలని చాలెంజ్ విసిరారు.

జలజాతరలో పెద్దపల్లి, రామగుండం , చొప్పదండి, కోరుట్ల , మంచిర్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నడిపెల్లి దివాకర్‌రావు, ఎమ్మెల్సిలు తానిపర్తి భానుప్రసాద్‌రావు, నారాదాసు లక్ష్మన్‌రావు, పెద్దపల్లి, జగిత్యాల జెడ్పి చైర్మ న్‌లు పుట్ట మధుకర్, దావ వసంత రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జెడ్పిటీసీ పూస్కూరి పద్మజా, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పొనుగొటి శ్రీనివాస్‌రావు, ముత్యాల బలరాంరెడ్డి, పూస్కూరి జితేందర్‌రావు, వైస్ ఎంపీపీ మేడవేణి తిరుపతి పాల్గొన్నారు.

minister Koppula Eshwar Fire On Bjp And Congress Party

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాంగ్రెస్, బిజెపి సంఘ విద్రోహ పార్టీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.