టిఆర్ఎస్ గెలుపు ఖాయం : జగదీష్ రెడ్డి

నల్గొండ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, మెజార్టీపైనే దృష్టి పెట్టాలని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం త్రిపురారంలో బుధవారం జరిగిన టిఆర్ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తే, పది వేల మంది ప్రజలు కూడా రాలేదని మంత్రి ఎద్దేవా చేశారు. రాహుల్ సభకు వచ్చిన స్పందనతోనే టిఆర్ఎస్ విజయం […]

నల్గొండ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, మెజార్టీపైనే దృష్టి పెట్టాలని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం త్రిపురారంలో బుధవారం జరిగిన టిఆర్ఎస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తే, పది వేల మంది ప్రజలు కూడా రాలేదని మంత్రి ఎద్దేవా చేశారు. రాహుల్ సభకు వచ్చిన స్పందనతోనే టిఆర్ఎస్ విజయం ఖాయమైందని ఆయన పేర్కొన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కార్యాలయాలకు తాళాలు వేసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. దేశ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిప్పనున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కెసిఆర్ వెన్నంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి నరసింహరెడ్డి మాట్లాడారు. ఉత్తమ్ సొల్లు మాటలు ఆపాలని, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు. ఉత్తమ్ ని మించిన దొంగ, దోపిడీ దారు ఎవ్వరు లేరని ధ్వజమెత్తారు. కారులో కోట్ల రూపాయలను ఎన్నికల్లో పంచడానికి తీసుకెళుతూ దొరికిన దొంగ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తాసుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Minister Jagdish Reddy Comments on Loksabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: