ఎన్నికల తరువాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు : జగదీశ్ రెడ్డి

నల్లగొండ : వచ్చే లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆడ్రస్‌ అడ్రస్ గల్లంతు కాక తప్పదని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండలో నియోజకవర్గస్థాయి టిఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓ అసమర్థ నేత అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తన్న ప్రతి ఒక్కరూ చెల్లని రూపాయేనని విమర్శించారు.  కాంగ్రెస్‌ నేతలకు ప్రజా సమస్యలు పట్టవని, వారికి […]

నల్లగొండ : వచ్చే లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆడ్రస్‌ అడ్రస్ గల్లంతు కాక తప్పదని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండలో నియోజకవర్గస్థాయి టిఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఓ అసమర్థ నేత అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తన్న ప్రతి ఒక్కరూ చెల్లని రూపాయేనని విమర్శించారు.  కాంగ్రెస్‌ నేతలకు ప్రజా సమస్యలు పట్టవని, వారికి పదవులు ఉంటే చాలునని విమర్శించారు. నల్లగొండలో నెగ్గని కోమటిరెడ్డి  భువనగిరిలో ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.. తెలంగాణలో టిడిపి గల్లంతైందన్నారు. ఈ సమావేశంలో రైతు రాష్ట్ర సమితి సమన్వకర్త గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, ఎంఎల్ఎ రవీంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Minister Jagdish Reddy Comments on Congress Leaders

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: