మూసీకి కొత్త గేటు

 

ప్రాజెక్టు వద్ద పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి , తయారీలో మరి 8 గేట్లు

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి: ఇటీవల విరిగిపోయిన మూసీ ప్రాజెక్టు 5వ నంబర్‌గేటు స్థానంలో అమర్చడానికి కొత్త గేటును ప్రాజెక్టుకు తరలించారు. గేటు అమర్చే విధానంపై మంత్రి జగదీష్‌రెడ్డి ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అదనంగా 5గేట్లను అధికారులు తయారు చేయించారు. కాని చిత్తూరు జిల్లాలో కొత్తగా నిర్మించిన కళ్యాణి డ్యాంకు అమర్చేందుకు వాటిని తీసుకెళ్లారు. అక్కడ 4గేట్లను డ్యాంకు అమర్చారు. మిగిలిన గేట్లను మూసీ ప్రాజెక్టుకు తరలించారు. అదనంగా మరి 8గేట్లను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో మాదిరిగా గేట్లను స్టాఫ్‌లాగ్ పద్ధతిలో కాకుండా కాంక్రీట్‌తో బిగించడం ద్వారా కాంక్రీట్ కొట్టుకు పోవడంతో మూసీ ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశంతో ప్రకటించిన విధంగా 48గంటల్లోనే మూసీకి గేట్‌ను తరలించారు. చేయించారు. కాని చిత్తూరు జిల్లాలో కొత్తగా నిర్మించిన కళ్యాణి డ్యాంకు అమర్చేందుకు వాటిని తీసుకెళ్లారు. అక్కడ 4గేట్లను డ్యాంకు అమర్చారు. మిగిలిన గేట్లను మూసీ ప్రాజెక్టుకు తరలించారు. అదనంగా మరి 8గేట్లను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో మాదిరిగా గేట్లను స్టాఫ్‌లాగ్ పద్ధతిలో కాకుండా కాంక్రీట్‌తో బిగించడం ద్వారా కాంక్రీట్ కొట్టుకు పోవడంతో మూసీ ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశంతో ప్రకటించిన విధంగా 48గంటల్లోనే మూసీకి గేట్‌ను తరలించారు

Minister Jagadish Reddy Inspects at Musi river

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూసీకి కొత్త గేటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.