నల్లగొండ పార్లమెంటు సీటు పై గులాభీ నజర్

నల్లగొండః తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామరావు హాజరుకానున్న పార్లమెంటు ఎన్నికల సన్నహాక సభకు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సభ నిర్వహించు వేధికను గురువారం రాష్ట్ర విద్య శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పరిశీలించారు. సభకు విచ్చేసే ఆహుతులకు ప్రత్యేక పార్కింగ్ సధుపాయం వుండేలా ఏర్పాట్లు చేసే విధంగా సూచనలు చేశారు. పార్లమెంటు నియోజికవర్గ పరిధిలోని నాయకులతో పాటు రాష్ట్రంలోని నలు మూలల నుంచి తెలంగాణ రాష్ట సమితి […]

నల్లగొండః తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామరావు హాజరుకానున్న పార్లమెంటు ఎన్నికల సన్నహాక సభకు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సభ నిర్వహించు వేధికను గురువారం రాష్ట్ర విద్య శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పరిశీలించారు. సభకు విచ్చేసే ఆహుతులకు ప్రత్యేక పార్కింగ్ సధుపాయం వుండేలా ఏర్పాట్లు చేసే విధంగా సూచనలు చేశారు. పార్లమెంటు నియోజికవర్గ పరిధిలోని నాయకులతో పాటు రాష్ట్రంలోని నలు మూలల నుంచి తెలంగాణ రాష్ట సమితి పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నందున అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశానికి భారీగా జనం తరలి వచ్చే అవకాశం వున్నందున విఐపి పార్కింగ్ గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్ర వాహన పార్కింగ్, కార్ల పార్కింగ్, భారీ వాహానాల పార్కింగ్‌లను వేరువేరు సిద్ధం చేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు సమావేశానికి వచ్చే అవకాశం వున్నందున మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. మీటింగ్‌కు వచ్చే జనానికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మీటింగ్ వేధిక, పార్కింగ్, సమావేశ స్థలంలను గ్రాఫ్ ద్వార మంత్రికి స్థానిక శాసన నేతలు వివరించారు. ఇదిలావుంటే పార్టీ కార్యనిర్వహాక అధ్యక్ష పదవి చేపట్టి మొదటి సారి జిల్లా కేంద్రానికి రామన్న వస్తుండడంతో కార్యకర్తల్లో ఉత్సహాం నెలకొంది. చోట మోట లీడర్ల అంత నాయకుడిని కలిసి జిల్లాలోని సమస్యలను వివరించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. జిల్లాను ముఖ్యమంత్రి దత్తత తీసుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో ఆ విషయం పై రేపు 16న జరుగు సమావేశంలో స్పష్టత ఇస్తారని కొందరు ముఖ్య కార్యకర్తలు భావిస్తున్నారు. జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత తీసుకుంటే 40 ఏళ్ళ జిల్లా వెనుభాటు చెదిరిపోయి అబివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
భారీ ఎర్పాట్లు
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నహాక సమావేశం ఈ నెల 16న నల్లగొండ సమీపంలోని బైపాస్ రోడ్డులోని ఎన్‌ఆర్‌ఎస్ గార్డెన్ సమీపంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. లక్ష మందితో సమావేశం నిర్వహించే లక్షంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నల్లగొండ పార్లమెంటు నియోజిక వర్గం పరిధిలోని శాసన సభ నియోజికవర్గాల శాసన సభ్యులకు ఆయా నియోజిక వర్గాల జన సమీకరణను అప్పగించారు. నల్లగొండ, హుజుర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, నాగార్జున సాగర్, కోదాడ నియోజిక వర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నల్లగొండలో కాంగ్రెస్ ఒటరు శాతం ఎక్కువగా వుందన్న ఉహగానాలతో ఎక్కువ సంఖ్యలో జనాన్ని సమీకరణ చేయాలని టిఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లను చేయాడంలో నిమగ్నం అయ్యారు.

ఎన్నికల సన్నహాక సభకు జిల్లానేతలతో పాటు రాష్ట్రం నుంచి భారీగా నేతలు తరలి వచ్చే అవకాశం వుండబంతో సమావేశం నిర్వహించు స్థలం వద్ద భారీ వేధికను ఏర్పాటు చస్తున్నారు. 100 మంది కూర్చునే విధంగా వేధికను తయారు చేస్తున్నారు. మంత్రి వెంట ఏర్పాట్లను స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిషోర్‌కుమార్, ఎప్‌డిసి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు వేధిక ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నియమావలి అమలులోకి వచ్చినంధులన సన్నహాక సమావేశాలను నిలిపే సూచనలు కనబడుతున్నాయి. నల్లగొండ పై ముఖ్యమంత్రికి ప్రత్యేక దృష్టి వుండడంతో ప్రకటించిన ప్రకారం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సన్నహాక సమావేశం నల్లగొండదే చివరిది అయ్యే అవకాశం వుంది.

Minister Jagadish Reddy Examined Sabha Vedhika

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: