ఉత్తమ్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్

నల్లగొండ : తెలంగాణ విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే ఉత్తమ్ ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జరిగిన నల్లగొండ అసెంబ్లీ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో నిలిపేందుకు కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. లోక్ […]

నల్లగొండ : తెలంగాణ విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే ఉత్తమ్ ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం జరిగిన నల్లగొండ అసెంబ్లీ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో నిలిపేందుకు కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఉంటే, ఉత్తమ్ తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండలో చెల్లుబాట కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెల్లుబాటు అవుతారా అని మంత్రి ప్రశ్నించారు. ఈ లోక్ సభ ఎన్నికలతో జిల్లాకు పట్టిన కాంగ్రెస్ పీడ విరుగుడు కాకతప్పదని ఆయన తేల్చి చెప్పారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలను సాధించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తీర్పే లోక్ సభ ఎన్నికల్లో పునరావృతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. నల్లగొండ, భువనగిరి ఎంపి స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన కోరారు. యావత్ దేశం కెసిఆర్ వైపే చూస్తుందని, తెలంగాణలో 16 స్థానాలు సాధించి ఢిల్లీలో టిఆర్ఎస్ చక్రం తిప్పుతుందని ఆయన పేర్కొన్నారు.

Minister Jagadish Reddy Comments on TPCC Chief Uttam

 

Related Stories: