మహిళల భద్రతకు పెద్దపీట : ఈటల

కరీంనగర్ : తెలంగాణ సిఎం కెసిఆర్ మహిళల భద్రతకు పెద్ద పీట వేశారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకుని హుజూరాబాద్ లో ఈటలకు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలకు ఆయన రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతిస్థాయిలోనూ వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం […]

కరీంనగర్ : తెలంగాణ సిఎం కెసిఆర్ మహిళల భద్రతకు పెద్ద పీట వేశారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకుని హుజూరాబాద్ లో ఈటలకు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలకు ఆయన రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతిస్థాయిలోనూ వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. రాఖీ పండుగను తెలంగాణ ప్రజలు గొప్పగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

comments

Related Stories: