అడవులను పరిరక్షిద్దాం

అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: అటవీ సంపద పరిరక్షణలో ప్రాణాలర్పించిన అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నెహ్రు జులాజికల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. సభలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, వన్య ప్రాణులు, […] The post అడవులను పరిరక్షిద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత
అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: అటవీ సంపద పరిరక్షణలో ప్రాణాలర్పించిన అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నెహ్రు జులాజికల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. సభలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, వన్య ప్రాణులు, అడవుల రక్షణలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి అల్లోల మాట్లాడుతూ, అటవీ సంపదైన వృక్షాలు, వన్యప్రాణులు ఎంతో విలువైన సంపదన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వ్యాఖ్యానించారు.

రాజస్థాన్‌లో అడవులను రక్షించడంలో 360 మంది తమ ప్రాణాలను సైతం అర్పించారని, వారికి గుర్తుగా దేశంలో సెప్టెంబరు11న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నామన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 21 మంది అటవీ సిబ్బంది దుండగుల చేతిలో వీరమరణం పొందారని తెలిపారు. అటవీ సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత ఉండాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్‌హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 174 కోట్ల మొక్కలు నాటామని వివరించారు.

రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచాలన్న బృహత్తర లక్షంతో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన పంతాయతీ, మున్సిపల్ చట్టాల ద్వారా నాటిన మొక్కలను సంరిక్షించుకునేందకు కఠినమైన నిబంధనలను పొందుపరిచామని తెలిపారు. నాటిన వాటిల్లో 85 శాతం మొక్కలు ఖచ్చతింగా సంరక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అటవీశాఖను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించామన్నారు. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి అవసరమైన వాహనాలను, ఇతర సౌకర్యాలను సమకూర్చడం జరిగిందన్నారు. ప్రకృతి ప్రసాదించిన వన సంపదను రేపటి మన భవిష్యత్తు, భావి తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

మన రాష్ట్ర అటవీ సంపదను సంరక్షించడానికి ఎంతో మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ధైర్య సాహాసాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగనిరతికి గుర్తుగా అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం పిసిసిఎఫ్ ఆర్. శోభ మాట్లాడుతూ, అడవుల పరిరక్షణకు సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జంగల్ బచావో… జంగల్ బడావో’ నినాదంతో అడవుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కృత నిశ్చతయంతో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులు, సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసిఎఫ్‌లు పృథ్వీరాజ్, రఘువీర్, మునీంద్ర, అడిషనల్ పిసిసిఎఫ్‌లు లోకేష్ జైస్వాల్, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్‌తదిత్రులు పాల్గొన్నారు.

Minister Indrakaran Reddy at the martyrs obituary

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అడవులను పరిరక్షిద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: