సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటెల

  కరీంనగర్‌: హుజూరాబాద్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ నుంచి తనను తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలపై ఈటెల మాట్లాడుతూ.. తననపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. బిసి కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని తాను ఎవరినీ అడగలేదని, 15 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచి 5 రూపాయలు కూడా తీసుకోలేదని… నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని […] The post సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటెల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్‌: హుజూరాబాద్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ నుంచి తనను తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలపై ఈటెల మాట్లాడుతూ.. తననపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. బిసి కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని తాను ఎవరినీ అడగలేదని, 15 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచి 5 రూపాయలు కూడా తీసుకోలేదని… నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి ఈటెల అన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని… ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని అన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్నీ కాదని, బతికొచ్చినోన్నీ కాదని అన్నారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్ళం కాదని చెప్పారు. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని, ప్రజలే చరిత్ర నిర్మాతలని వ్యాఖ్యానించారు. ధర్మం, న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదన్నారు.

Minister Etela Sensational comments at Huzurabad

The post సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటెల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.