వైద్య పరికరాల పరిరక్షణ

మనతెలంగాణ/ హైదరాబాద్ :కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న వైద్య పరికరాలు దీర్ఘకాలం పనిచేసేలా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకొంటోంది. అందు కోసం పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త విధానాన్ని అమలుచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన శాఖ అధికారులను ఆదేశించారు. యంత్రాల నిర్వహణ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయంకూడా తీసుకొన్నట్టు తెలిసింది.  ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, యంత్రాల మరమ్మతుల కోసం ఫేబర్ సింధూరి మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తెలంగాణ […] The post వైద్య పరికరాల పరిరక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/ హైదరాబాద్ :కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న వైద్య పరికరాలు దీర్ఘకాలం పనిచేసేలా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకొంటోంది. అందు కోసం పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త విధానాన్ని అమలుచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన శాఖ అధికారులను ఆదేశించారు. యంత్రాల నిర్వహణ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయంకూడా తీసుకొన్నట్టు తెలిసింది.  ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, యంత్రాల మరమ్మతుల కోసం ఫేబర్ సింధూరి మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ(టిఎస్‌ఎంఎస్‌ఐడి సి) చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. యుద్ధప్రాతిపదికన ఆస్పత్రుల్లో పనిచేయని పరీ క్షా యంత్రాలను రిపేర్ చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీనికోసం కాంప్రహెన్సీవ్ ఆన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్(సిఏఎంసి) పద్దతినో నేరుగా మానుఫాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. దీని వల్ల యంత్రాల మనుగడకు ఎనిమిది సంవత్సరాలవరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు.

రిపేర్లకు నోచుకోకుండా మూలకు పడుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల యంత్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాత్కాలిక చర్యలకు బదులు యంత్రాల నిర్వహణకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాన్ని పూర్తి గా ప్రక్షాళించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఉన్నతాధికారుల తో ఈ అంశంపై బుధవారం మంత్రి చర్చించారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే మిషన్, రేడియాలజి మిషన్లు సహా మొత్తం 20 పెద్ద మిష న్ల నిర్వాహణ బాధ్యతను మానుఫాక్చరింగ్ కంపెనీలకే అప్పగించాలని నిర్ణయించారు. మధ్య రకం యంత్రాల నిర్వాహణ బాధ్యతను టిఎస్‌ఎంఐడిసి పరిధిలో పన్జేస్తున్న బయోమెడికల్ ఇంజనీర్లకు అప్పగించనున్నారు. ప్రస్తు తం యంత్రాల నిర్వాహణకు ఫేబర్ సింధూరి సంస్థతో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 35 వేల యంత్రాల నిర్వహణ కోసం 2017 జూన్ 6న- ఆ సంస్థతో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఒప్పందం చేసుకుంది. ఈ మొత్తం యంత్రాల విలువ సుమారు రూ . 400 కోట్ల వరకు ఉంటాయి. యంత్రాల విలువలో 5.7 శాతం మొత్తాన్ని ప్రతి ఏటా సదరు సంస్థ కు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంది. అందుకోసం ఏడాదికి రూ. 12 నుంచి- 15 కోట్ల వరకు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచూ వైద్య పరికరాలు, యంత్రాలు మోరాయిస్తుండటంతో వాటిని రిపేర్ చేసేందుకు ఔట్ సోర్సింగ్ పద్దతిన నిర్వహించేందుకు రెండేళ్ల కిందట ప్రభుత్వం ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. రిపేర్ కు వచ్చిన ఏడు రోజుల్లోనే సదరు సంస్థ ఇంజనీర్లు వెళ్లి ఆ యంత్రాలను బాగు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఫేబర్ సింధూరి సంస్థ సకాలంలో యంత్ర పరికరాలను రిపేర్ చేయలేకపోయింది. వైద్య పరికరాలు పరికరాలు తరచూ మొరాయిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో యంత్రపరికరాలు తరచూ వనిచేయకపోతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లాంటి బోధనాసుపత్రులతో పాటు జిల్లా ఆస్పత్రుల్లోని సిటి స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్ లాంటి యంత్రాలను రిపేర్ చేసే బాధ్యత ఆ సంస్థ కు అప్పగించగా, అనుకున్న ఫలితం రాలేదు.

ఫిర్యాదులు ఎక్కువై ప్రభుత్వానికి చడ్డపేరు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కోట్ల రూపాలయలతో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. రోజువారీ నిర్వహణను పట్టించు కోపోవటంతో ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయి. ఇటీవల మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఈటెల ఆసుపత్రులను సందర్శిస్తున్నపుడు వీటిపై ఫిర్యాదులు అందాయి. భవిషత్తులో ఇలాంటి సమత్యలు తలెత్తకుండా ఆ యంత్ర పరికరాలను సరఫరా చేసే సంస్థలకే నిర్వహ ణ బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించారు. ఒక కొత్త యంత్రాన్ని కొనుగోలు చేస్తే సహజంగానే మొద టి మూడు సంవత్సరాలు వారంటీని కంపెనీనే ఇస్తుంది. ఆ సమయంలో చెడి పోయినా, యంత్ర పరికరాల విడిభాగాలను రీప్లేస్ చేయాల్సివచ్చినా ఉచితంగానే చేస్తారు. ఆ తరువాత కాంప్రహెన్సీవ్ ఆన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్( సిఏఎంసి) పద్దతిన యంత్రాల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. ఒక భారీ యంత్ర పరికరాన్ని కొనుగోలు చేస్తే సహజంగానే ఇటువంటి ఒప్పందం ఉంటుంది. దానివల్ల మూడేళ్ల పాటు ఉచితంగానే అన్ని రకాల రిపేర్లు చేయాలి. నాలుగో ఏడాది నుంచి ఆ యంత్ర పరికరం సిఎఎంసి పరిధిలోకి వస్తుంది. నాల్గో ఏడాది నుంచి ఆ మిషనరీ ఖరీదులో 5 శాతం చొప్పున ప్రభుత్వమే నిర్వహణ వ్యయాన్ని కుపెనీలకు చెల్లిస్తుంది.

ఇలా ప్రతి ఏటా ఒక శాతం చొప్పున ఎనిమిదవ ఏడాది వరకు చెల్లించాలన్నది ప్రస్తుత నిర్ణయం. సాధారణంగా పరీక్షలు నిర్వహించే యంత్ర పరికరాల సగటు సామ ర్థ్యం ఎనిమిదేళ్ళే. ఇక నుంచి అన్ని ఆస్పత్రుల్లో ఉన్న యంత్ర పరికరాలను వాటిని సరఫరా చేసే ఉత్పత్తి కంపెనీలే రిపేర్లు చేయాల్సివుంటుంది, అందుకు వారితో సర్కా రు సిఏఎంసి చేసుకుంటుంది. దానికి టిఎస్‌ఎంఎస్‌ఐడిసి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఏ ఆస్పత్రిలో మిష న్ చెడిపోయినా దాన్ని ఉత్పత్తి చేసిన సంస్థ సిఏఎంసి ఒప్పందం మేరకు వచ్చి రిపేర్ చేస్తుంది. ఆ ఖర్చును స్థాని క ఆస్పత్రులే చెల్లిస్తాయి. తదనంతరం ఆమొత్తాన్ని టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఆస్పత్రులకు చెల్లిస్తుంది. ఇది అమలులోకి వస్తే భవిషత్తులో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల వ్యాధి నిర్ధారణకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

minister Etela Rajender Speech About Medical equipment

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వైద్య పరికరాల పరిరక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.