సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : ఎర్రబెల్లి

Minister Errabelliమమబూబాబాద్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే, వ్యాధులు రావని ఆయన పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కోసం, పారిశుద్ధ్యం, పచ్చదనం, పరిశుభ్రత కోసం సిఎం కెసిఆర్ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి  ఈటల రాజేందర్, ఎంపి మాలోతు కవిత, ఎంఎల్ఎలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, జడ్ పి చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Minister Errabelli Comments On Seasonal Diseases

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.