నిరుద్యోగుల కోసం రేపు మినీ జాబ్‌ మేళా

  హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు బుధవారం విజయనగర్‌కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఐప్రొసెస్ సర్వీసెస్, విశాల్ మెగామార్ట్, యష్మి సొల్యూషన్స్, కాలిబ్‌హెచ్‌ఆర్, ఇన్నోవ్ సోర్స్ వంటి ప్రైవేటు కంపెనీలో పనిచేయుటకు దాదాపు 210 ఉద్యోగాల ఎంపికకు మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్దులు ఇంటర్, డిగ్రీ, ఎంబిఎ, పిజీ […] The post నిరుద్యోగుల కోసం రేపు మినీ జాబ్‌ మేళా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు బుధవారం విజయనగర్‌కాలనీలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఐప్రొసెస్ సర్వీసెస్, విశాల్ మెగామార్ట్, యష్మి సొల్యూషన్స్, కాలిబ్‌హెచ్‌ఆర్, ఇన్నోవ్ సోర్స్ వంటి ప్రైవేటు కంపెనీలో పనిచేయుటకు దాదాపు 210 ఉద్యోగాల ఎంపికకు మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్దులు ఇంటర్, డిగ్రీ, ఎంబిఎ, పిజీ చదివిన వారు అర్హులని, వీరిని ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ సపోర్టు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలంప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ రిప్రసేంటేటివ్, ప్రమోటర్స్ ఉద్యోగాల కోసం ఇంట్వలు జరుగనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10వేల నుంచి రూ.18వేలవరకు వేతనాలు ఇవ్వబడుతాయని, అభ్యర్దుల వయస్సు 19నుంచి 30సంవత్సరాలు గల పురుషులు, స్త్రీలు పాల్గొన వచ్చన్నారు.

అర్హత కలిగిన అభ్యర్దులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ జీరాక్స్ కాఫీలతో ఈనెల 5న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు మేళాకు హాజరు కావాలని కోరారు. వివరాల కోసం టి. రఘపతి యంగ్ ప్రొఫెషనల్ పోన్ 8247656356 నెంబర్‌కు వాట్సాప్‌లో సంప్రదించాలన్నారు.

Mini Job fair Tomorrow for Unemployed

The post నిరుద్యోగుల కోసం రేపు మినీ జాబ్‌ మేళా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: