టిఆర్‌ఎస్ వెంటే మజ్లిస్

దేశ రాజకీయాల్లో కీలక భూమిక దిశగా అడుగులు హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వెడెక్కింది. ఆదివారం నాటికి ఆరు విడుతల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. కేవలం చివరి విడుత ఓటింగ్ మాత్రమే జరగాల్సి ఉండటంతో దేశ అత్యున్నత అధికార పగ్గాల పై రాజకీయ పక్షాల్లో అంతర మధనం ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచే టిఆర్‌ఎస్‌కు వెన్న దన్నుగా నిలుస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఎతేహదుల్ ముస్లిమీన్(మజ్లిస్) దేశ రాజకీయాల్లో సహితం క్రియా భూమిక […] The post టిఆర్‌ఎస్ వెంటే మజ్లిస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
దేశ రాజకీయాల్లో కీలక భూమిక దిశగా అడుగులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వెడెక్కింది. ఆదివారం నాటికి ఆరు విడుతల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. కేవలం చివరి విడుత ఓటింగ్ మాత్రమే జరగాల్సి ఉండటంతో దేశ అత్యున్నత అధికార పగ్గాల పై రాజకీయ పక్షాల్లో అంతర మధనం ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచే టిఆర్‌ఎస్‌కు వెన్న దన్నుగా నిలుస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఎతేహదుల్ ముస్లిమీన్(మజ్లిస్) దేశ రాజకీయాల్లో సహితం క్రియా భూమిక నిర్వహించేందుకు సిద్దమైతుంది. శాసన సభ ఎన్నికల్లో సహితం మజ్లిస్ టిఆర్ పార్టీ అభ్యర్ధులకు మిత్రపక్షంగా వ్యవహిరించిది. అలాగే రాబోవు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను కూడా మజ్లిస్ పార్టీ వ్యూహం మేరకు అత్యధిక లోక్ సభ స్థానాలను వస్తాయని అంచనాలు వినిపిస్తున్నాయి.

అలాగే టిఆర్‌ఎస్ పార్టీ సహితం మజ్లిస్ అధినేత అసద్ హైదరాబాద్ లోక్ సభ స్థానానికి పోటి చేయని విషయం విదితమే. ఇదిలా ఉండగా ఆరు విడుతల ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో అధికార పగ్గాలు చేపట్టేందకు కావాల్సి మాజిక్ ఫిగర్ 272 స్థానాల పై ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు అంచాల్లో మునిగిపొయారు. ప్రసుత్త అధికార పక్షం (ఎన్‌డిఏ) మరో సారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రధాన ప్రతి పక్ష కాంగ్రెస్ యూపిఏ పక్షాలతో అధికార పగ్గాలు చేపట్టాలని ఎత్తులు వెస్తుంది. మరో వైపు తొలి సారి దేశ రాజకీయాలను శాశించే విధంగా ప్రాంతీయల పార్టీల అధినేతలు సహితం అడుగులు వేస్తున్నారు. ఆరు విడుతల పొలింగ్ సరళి పై ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు దేశంలో బలమైన ఆయా రాష్ట్ర ల ప్రాంతీయ పక్షాలు సహితం అధికారంలోకి వచ్చే పార్టీ బల బలాల మీద కసరత్త చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా జరుగుతున్న ఎన్నికల్లో మజ్లిస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా టీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం విదతమే. ముందస్తు శాసన సభ ఎన్నికల్లో బహాటంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ టీఆర్‌ఎస్ అభ్యుర్ధుల తరుపున ప్రచారం నిర్వహించారు. అనంతరం జరుగుతున్న స్థానిక పంచాయి, జిల్లా , మండల పరిషత్ ఎన్నికల్లో సహితం అంతర్గంతంగా మజ్లిస్ నాయకత్వం టిఆర్‌ఎస్ అభ్యర్ధులకు మద్దుతు పలికింది. ఐతే రాబోవు కాలంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సహితం మజ్లిస్ సేహ్నపూర్వకంగా పోటీ కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయ. ఇదిలా ఉండగా దేశ రాజకీయాల్లో కూడ మజ్లిస్ క్రియాశీల పాత్ర పొషించే విధంగా అధినేత అసద్ వ్యూహాలను రచించారని వినికిడి.

ఇందులో భాగంగా మహారాష్ట్ర, కర్నాటక తదితర ప్రాంతాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ బహాటంగా బరిలోకి దిగింది. అలాగే ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే పలు మార్లు అధిపత్యాన్ని చాటుకునే విధంగా ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలకమైన మలుపు సృష్టించే విధంగా మస్లిస్ అధినేత అసద్ చక్రం తిప్పుతారని ప్రచారం జోరందుకుంది. ఇటీవల మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యాకుత్‌పూరా శాసన సభ్యులు దారుస్సలాంలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పోషించే పాత్రను అధినేత అసద్ ఖరారు చేస్తారని వెల్లడించారు. మజ్లిస్ పార్టీ టిఆర్‌ఎస్‌కు వెన్న దన్నుగానే కొనసాగుతుందని ఆయన సూత్రప్రాయంగా పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా పలు సందర్భాలలో మజ్లిస్ అధినేత అసద్ తెలంగాణ రాష్ట్రం సిఎం. కెసిఆర్ దేశానికి మార్గదర్శకులైన ముఖ్యమంత్రి(సిఎం)గా బహాటంగా ప్రశంసించారు. అలాగే గత ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలను సి.ఎం.కెసిఆర్ నెరవెర్చారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి నేత దేశ ప్రజలకు అవసరం అంటూ అసద్ పలు సందర్భాలు, సమావేశాల్లో వక్కానించారు. మరో సందర్భంగా కెసిఆర్ లాంటి నేత దేశానికి ప్రధాన మంత్రిగా ఎంపికైతే ,కోట్లాది ప్రజల ఆశలు తీరుతాయని ఆయన పేర్కొన్న విషయం విదితమే. అలాగే ప్రాంతీయ పార్టీలు పక్కాగా ఈ సారి దేశ రాజకీయాలను శాసిస్తాయని ఆయన జోస్యం చేప్పారు. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసద్ భాజపా, కాంగ్రెస్ పార్టీలు దేశానికి పట్టిన శనిగా విమర్శించిన విషయం విదితమే.

MIM Party to Support TRS Party Candidates

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్‌ఎస్ వెంటే మజ్లిస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: