గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా వ్యక్తి ఆత్మహత్య

  మన తెలంగాణ/రాయికల్ : ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్ బాటపట్టిన ఓ వలసజీవి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఇది. రాయికల్ మండలం కట్కాపూర్ అటవీ గ్రామానికి చెందిన అయితం భూమయ్య (43) అనే వ్యక్తి తన గదిలో ఈ నెల 9న ఉరివేసుకొని తనువు చాలించినట్లు స్నేహితులు స్వగ్రామానికి సమాచారం అందించారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కట్కాపూర్ గ్రామానికి చెందిన భూమయ్య గత 15 ఏళ్ల క్రితం స్థానికంగా సాగు అచ్చిరాక […] The post గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా వ్యక్తి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/రాయికల్ : ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్ బాటపట్టిన ఓ వలసజీవి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఇది. రాయికల్ మండలం కట్కాపూర్ అటవీ గ్రామానికి చెందిన అయితం భూమయ్య (43) అనే వ్యక్తి తన గదిలో ఈ నెల 9న ఉరివేసుకొని తనువు చాలించినట్లు స్నేహితులు స్వగ్రామానికి సమాచారం అందించారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కట్కాపూర్ గ్రామానికి చెందిన భూమయ్య గత 15 ఏళ్ల క్రితం స్థానికంగా సాగు అచ్చిరాక ఉపాధి నిమిత్తం అప్పు చేసి దుబాయి వెళ్లాడు. అక్కడి ఓ ప్రవేటు కంపెనీలో కూలీగా చేరి పనులు చేస్తున్నాడు. వేతనాలు తక్కువగా ఉన్నప్పటికి అదే కంపెనీలో చాలాకాలంగా పని చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ కంపెనీలో గత కొంత కాలం నుండి వేతనాలు అందించకపోవడంతో భూమయ్య తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డట్లు సమాచారం. ఇంటి వద్ద చేసిన అప్పులు తీర్చే దారి లేక మనస్థాపంతోనే భూమయ్య తన గదిలో ఉరి వేసుకొని తనువు చాలించినట్లు తెలుస్తుంది. భూమయ్య చనిపోయినట్లు గ్రామంలో తెలియడంతో విషాదం నెలకొంది. భూమయ్యకు భార్య సునిత, కుమారుడు, కూతురు ఉన్నారు. శవాన్ని స్వగ్రామానికి త్వరగా పంపేలా అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Migrant workers Committed suicide in Gulf

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా వ్యక్తి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: