మెట్రో సేవలకు మరోసారి అంతరాయం

Metro Train

హైదరాబాద్: నగరంలో రోజుకు లక్షలామంది ప్రయాణికులను గమ్యస్దానాలకు చేరవేస్తున్న మెట్రో అప్పుడప్పుడు మొరాయిస్తూ విధులకు చేరుకోవాల్సిన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. ఉదయం సమయంలో నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సి పరిస్దితి నెలకొంది. నెలరోజుల్లో రెండుసార్లు ఇదే విధంగా జరగడంతో నిత్యం ప్రయాణించే వారంతా మెట్రో యాజమాన్యం నిర్లక్షం వహిస్తుందని మండిపడుతున్నారు. ఇదే విధంగా రైళ్ల నిలిచిపోతే ప్రయాణికులు దూరమైతారని పేర్కొంటున్నారు. శనివారం మెట్రో సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది.

మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్తున్న మెట్రో రైల్వేలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంజాగుట్ట వద్ద దాదాపు 27 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. ఆగిపోయిన రైలును లూప్‌లైన్‌లో పెట్టిన సిబ్బంది. మిగిలిన రైళ్లకు లైన్ రూట్ క్లియర్ చేశారు. రైలు మొరాయించడంపై మెట్రో ఉన్నతాధికారులు ఆరాతీస్తూ భవిష్యత్తులో ఈవిధంగా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు పడితే మెట్రోకు ఆదరణ తగ్గుతుందని భావిస్తున్నారు. ఇకా అలాంటి సమస్యలు రాకుండా చూస్తామని వెల్లడిస్తున్నారు.

Metro train in Hyderabad stopped due to technical issues

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెట్రో సేవలకు మరోసారి అంతరాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.