దొంగల మాయాజాలం…నదిలో బ్రిడ్జి మాయం

భూకబ్జా చేసే భూ బకాసురులు గురించి వింటుంటాం. కానీ నదిలో ఉండే ఇనుప బ్రిడ్జిని అమాంతం మాయం చేసే సంఘటన రష్యాలో ఉంబా నదిలో జరగడం విస్మయం గొలుపుతోంది. రష్యా లోని ఆర్కిటిక్ రీజియన్ ఒక్తాబ్రిస్క్‌యా అనే నిషేధిత ప్రాంతానికి చేరువగా ఉన్న ఉంబా నదిలో వాడుకలో లేని పాతబ్రిడ్జి మధ్య భాగం 56 టన్నుల ఇనుముతో తయారై ఉంది. ఇది అదృశ్యమైందంటూ రష్యా సోషల్ మీడియా సైట్ వికెలో మొదట మే నెలలో వెల్లడైంది. ఎప్పుడైతే […] The post దొంగల మాయాజాలం… నదిలో బ్రిడ్జి మాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భూకబ్జా చేసే భూ బకాసురులు గురించి వింటుంటాం. కానీ నదిలో ఉండే ఇనుప బ్రిడ్జిని అమాంతం మాయం చేసే సంఘటన రష్యాలో ఉంబా నదిలో జరగడం విస్మయం గొలుపుతోంది. రష్యా లోని ఆర్కిటిక్ రీజియన్ ఒక్తాబ్రిస్క్‌యా అనే నిషేధిత ప్రాంతానికి చేరువగా ఉన్న ఉంబా నదిలో వాడుకలో లేని పాతబ్రిడ్జి మధ్య భాగం 56 టన్నుల ఇనుముతో తయారై ఉంది. ఇది అదృశ్యమైందంటూ రష్యా సోషల్ మీడియా సైట్ వికెలో మొదట మే నెలలో వెల్లడైంది. ఎప్పుడైతే మీడియా ద్వారా ఈ విషయం బయటపడిందో చాలామంది స్థానికులు ఇది దొంగల పనే అని చెప్పడం ప్రారంభించారు.

మే 16 న వికె సైట్‌లో వెలువడిన దృశ్యాల బట్టి బ్రిడ్జి మధ్యభాగం విరిగి నదిలో కూలిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. కానీ మే 26 న గగన వీక్షణ దృశ్యాలు కొత్తగా విడుదల అయ్యాయి. బ్రిడ్జి మొత్తం నదిలో పూర్తిగా అదృశ్యం అయినట్టు బయటపడింది. ఎవరో ఈ బ్రిడ్జి శిధిలాలు కూడా కనబడకుండా చేశారని, ఇది సహజంగా జరిగినది కాదని పత్రికలో వార్తలు వచ్చాయి. దీనిపై కిరోవిస్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బ్రిడ్జి ఒకప్పుడు కొన్ని గ్రామాలకు వారధిగా ఉండేది. కొన్నేళ్ల క్రితమే దీన్ని రద్దు చేశారు.

Metal thieves steal rail bridge Theft in Russia

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దొంగల మాయాజాలం… నదిలో బ్రిడ్జి మాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: